లీడర్ తలపై ఓవర్ బరువు

Wed Sep 11 2019 20:00:01 GMT+0530 (IST)

Mythri Movie Makers Hopes on Nani Gang Leader Movie

ఇంకో 36 గంటల్లో నాని గ్యాంగ్ లీడర్ రిపోర్ట్స్ వచ్చేస్తాయి. న్యాచురల్ స్టార్  కొత్త తరహాలో చేసిన ఈ ప్రయోగం ఎలా ఉండబోతోందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లోనూ లేకపోలేదు. అయితే భారీ ఓపెనింగ్స్ వచ్చే విషయంగా మాత్రం ట్రేడ్ ఎలాంటి హామీ ఇవ్వలేకపోతోంది. కారణం చాలా వీక్ గా ఉన్న ప్రమోషన్స్. అదే ఆడుతుందన్న తరహాలో చేస్తున్న పబ్లిసిటీ అంతగా ఉపయోగపడటం లేదు. జెర్సీకి కనిపించినంత ట్రెండ్ సైతం గ్యాంగ్ లీడర్ ముందస్తు బుకింగ్స్ లో లేదని ఆన్ లైన్ సాక్షిగా కనిపిస్తున్న టికెట్లే సాక్ష్యం.నాని రేంజ్ హీరోకు దాదాపుగా ఇప్పటికే మొదటి రోజు ఫుల్స్ పడిపోవాలి. సింగల్ స్క్రీన్స్ కరెంట్ బుకింగ్ మీద ఆధారపడతాయనుకున్నా కనీసం మల్టీ ప్లెక్సుల్లోనైనా జోరు చూపించాలి. అదీ జరగడం లేదు. గ్యాంగ్ లీడర్ హిట్ కావడం మైత్రికి చాలా అవసరం. ఇప్పటికే మూడు ఫ్లాపులతో సతమవుతున్నారు భాగస్వామ్యులు. డియర్ కామ్రేడ్ కు రేంజ్ కు మించి మార్కెట్ మించి పబ్లిసిటీ చేసినా ఫలితం దక్కలేదు. ఇప్పుడు గ్యాంగ్ లీడర్ కనక బ్లాక్ బస్టర్ అయితే ఏవైనా నష్టాలు ఉంటే అవి తీరిపోయి మైత్రి బ్రాండ్ కు మళ్ళీ వెయిట్ వస్తుంది .

అలా కాకుండా సైలెంట్ గా వదిలేస్తే ఓపెనింగ్స్ మీద ఎంత లేదన్నా ప్రభావం ఉంటుంది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఉప్పెన - త్వరలో ప్రారంభం కావాల్సిన అల్లు అర్జున్ సుకుమార్ ల మూవీకి కావాల్సినంత బూస్ట్ దక్కాలంటే ఇప్పుడీ గ్యాంగ్ లీడర్ మాములు హిట్ అయితే సరిపోదు. గ్రౌండ్ రియాలిటీ చూస్తేనేమో అలా ఉంది. మరి ఈ క్రేజీ బ్యానర్ కి ఈసారైనా సక్సెస్ తో మైత్రి దొరుకుతుందో లేదో శుక్రవారం డిసైడ్ అవుతుంది