మై లవ్.. సూపర్ మెలోడీతో వచ్చిన రౌడీ

Mon Jan 20 2020 17:40:59 GMT+0530 (IST)

My Love Lyrical Video Song From Vijay Deverakonda World Famous Lover

క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్'. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా ఫిబ్రవరి 14 న రిలీజ్ కానుంది.  విడుదలకు నెలరోజులే ఉండడంతో ప్రమోషన్స్ ఊపందుకుంటున్నాయి. తాజాగా ఈ సినిమా నుండి మై లవ్ అంటూ సాగే మొదటి లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.ఈ సినిమాకు గోపి సుందర్ సంగీత దర్శకుడు. రెహమాన్ ఈ పాటకు సాహిత్యం అందించారు. పాడినవారు శ్రీకృష్ణ.. రమ్య బెహరా.   'ఐ యామ్ సో క్రేజీ బేబీ లైఫ్ ఈజ్ సింగింగ్ లవ్ మెలోడీ' అంటూ కోరస్ తో స్టార్ట్ అయిన పాట 'మై లవ్ మనసును మీటే ఏదో తియ్యని పాటే యదలో ఎపుడూ వినని యదలో ఎపుడూ జరిగే సింఫనీ.. ఐ ఫీల్ నౌ" అంటూ ఎంతో ఆహ్లాదకరంగా సాగింది.  గోపి సుందర్ ఈ పాటకు మంచి లవ్ మూడ్ లో సాగే ఒక మెలోడీ ట్యూన్ అందించగా రమ్య.. శ్రీకృష్ణ ఎంతో చక్కని ఫీల్ తో పాడారు. యూత్ కు వెంటనే కనెక్ట్ అయ్యే పాట ఇది. మేము యూత్ అనుకునేవారికి మాత్రం నాలుగు సార్లు వింటే కనెక్ట్ అవుతుంది.

ఈ సాంగ్ లిరికల్ వీడియోలో విజయ్ అందరూ హీరోయిన్లతో రొమాన్స్ చెయ్యడం చూపించారు.  విజువల్స్ కూడా ప్లెజెంట్ గా ఉన్నాయి.  పోస్టర్లకు.. టీజర్ కు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది కానీ ఫస్ట్ సాంగ్ తో ఈ సినిమాపై కొంత హైప్ పెరగడం ఖాయమే.. ఆలస్యం ఎందుకు.. ఆ యదలో జరిగే లవ్ సింఫనీ సంగతేంటో చూసేయండి.