Begin typing your search above and press return to search.

ఇకపై హీరో ఇన్వాల్ మెంట్ ఉంటుందట

By:  Tupaki Desk   |   19 Feb 2020 11:45 AM GMT
ఇకపై హీరో ఇన్వాల్ మెంట్ ఉంటుందట
X
ఈ మధ్య హీరోలు స్క్రిప్టింగ్ స్టేజి నుండే సినిమాలో ఇన్వాల్వ్ అవుతున్నారన్న విషయంపై బయటపడుతుంది. అయితే కొందరు తమ కెరీర్ గురించి ఆలోచిస్తూ తమ అనుభవంతో సినిమాలో ఇన్వాల్వ్ అవుతుంటే మరికొందరు ఏమి తెలియకపోయినా వేళ్ళు పెడుతూ ఆ సినిమాను ఎటూ కాకుండా చేస్తుంటారు. అయితే కథలో ఎక్కువగా వేలు పెట్టకుండా మేకింగ్ టైంలో హీరో జాగ్రత్త వహించి మంచి అవుట్ పుట్ తీసుకునేల ప్లాన్ చేసుకుంటే అటు డైరెక్టర్ కి ఇటు హీరోకి ఇద్దరికీ మంచే జరుగుతుంది. సరిగ్గా రెండో విధానాన్ని ఫాలో అవుతానంటున్నాడు నితిన్.

అయితే ఇకపై ప్రతీ సినిమాకు తన ఇన్వాల్మెంట్ ఉంటుందని చెప్పాడు నితిన్. 'ఇష్క్' విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నానని కానీ ఈ మధ్య కొందరు దర్శకులకు తనకి అనిపించింది చెప్పలేకపోయానని అంటున్నాడు. వరుసగా మూడు ఫ్లాపులు అందుకున్న నితిన్ భీష్మ విషయం లో ముందు నుండే ఇన్వాల్వ్ అవుతూ సినిమా మేకింగ్ బాగా వచ్చేలా చూసుకున్నాడట.

ఇకపై తనకు కథలో కూడా తను చెప్పిన మార్పులు చేస్తేనే సినిమా చేస్తానంటున్నాడు. ఒక వేళ సీన్ అనుకున్నట్లు రాకపోయినా మళ్ళీ రీ షూట్ చేసేలా దర్శకుణ్ణి కోరతానని తెలిపాడు. ఇలా చేయడం వల్ల సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని నమ్మను కానీ నటుడిగా నాకంటూ ఓ సాటిస్ఫాక్షన్ ఉంటుందని పైగా అందరూ ఇపుట్స్ తీసుకోవడం వల్ల సినిమా అవుట్ పుట్ బాగా వస్తుందని ఫైనల్ గా ఆ డైరెక్టర్ కే పెరోస్తుందని అన్నాడు.