తారక్ అంటే మరీ ఇంత పిచ్చా..!

Mon Dec 10 2018 23:00:01 GMT+0530 (IST)

My Favorite Hero NTR Said Kushboo

తెలుగు మరియు తమిళంలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగి దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించిన ఖుష్బు ప్రస్తుతం సినిమాలు రాజకీయాలు అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. సినిమాల్లో మంచి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తున్న ఖుష్బు తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పు విషయాలపై స్పందించిన ఖుష్బు తెలుగులో తన ఫేవరేట్ స్టార్ ఎవరు అనే విషయంపై చాలా ఉత్సాహంగా స్పందించారు.కొన్నాళ్ల క్రితం తనకు ఎన్టీఆర్ అంటే ఇష్టం అంటూ చెప్పిన ఖుష్బు తాజాగా ఈ ఇంటర్వ్యూలో కూడా తనకు ఎన్టీఆర్ ఫేవరేట్ అంటూ చెప్పుకొచ్చింది. ఇంకా మాట్లాడుతూ.. ఎన్టీఆర్ సినిమా వస్తుంది అంటే ఖచ్చితంగా మొదటి రోజు సినిమా చూడాల్సిందే. చిన్న పిల్ల మాదిరిగా విజిల్స్ వేయడం- పేపర్లు చల్లడం- చప్పట్లు కొట్టడం చేస్తానని చెప్పుకొచ్చింది. ఇక ఎన్టీఆర్ నుండి తాను ఆటోగ్రాఫ్ తీసుకున్నానని కూడా పేర్కొంది.

ఖుష్బుకు తమిళనాట ఏ స్థాయిలో అభిమానులు ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెకు గతంలో గుడి కూడా కట్టి అభిమానించారు. అంతటి అభిమానులు ఉన్న ఖుష్బు ఎన్టీఆర్ ను అభిమానించడం ఆయనతో పాటు ఆయన అభిమానులకు కూడా గర్వంగా చెప్పుకోవాలి. తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్నా తమిళ నాట ఎంతో మంది స్టార్స్ ఉన్నా కూడా ఖుష్బుకు ఎన్టీఆర్ అంటే ఇంత పిచ్చి అభిమానం ఎందుకో మరి.