Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్ : బోల్డ్ సీన్స్.. డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో నిండిన 'మై బాయ్‌ ఫ్రెండ్స్‌ గర్ల్‌ ఫ్రెండ్‌

By:  Tupaki Desk   |   14 Aug 2020 4:30 PM GMT
ట్రైలర్ టాక్ : బోల్డ్ సీన్స్.. డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో నిండిన మై బాయ్‌ ఫ్రెండ్స్‌ గర్ల్‌ ఫ్రెండ్‌
X
'వినాయకుడు' 'విలేజ్ లో వినాయకుడు' వంటి చిత్రాలలో హీరోగా మెప్పించిన కృష్ణుడు ప్రొడ్యూసర్ అవతారమెత్తాడు. నిత్య క్రియేషన్స్ బ్యానర్ పై తొలి ప్రయత్నంగా ''మై బాయ్‌ ఫ్రెండ్స్‌ గర్ల్‌ ఫ్రెండ్‌'' అనే సినిమాని నిర్మించారు కృష్ణుడు. 'గడ్డం గ్యాంగ్' 'మొట్ట శివ కెట్ట శివ' వంటి చిత్రాలకు వర్క్ చేసిన జయరామ్ లోతుగడ్డ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లో 'మజిలీ' శివ - హర్షిత - వర్ష ప్రధాన పాత్రల్లో నటించారు. అనంత్ శ్రీకర్ సంగీతం సమకూర్చగా సురేష్ - శ్యామి సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఇటీవలే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేయడంతో ఈ సినిమాపై అందరి ద్రుష్టి పడింది. ఈ క్రమంలో తాజాగా ''మై బాయ్‌ ఫ్రెండ్స్‌ గర్ల్‌ ఫ్రెండ్‌'' ట్రైలర్ ని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు.

కాగా ఈ ట్రైలర్ ఆద్యంతం యూత్ ని ఆకట్టుకునే అంశాలతో సాగింది. బ్రెట్నీ, మధు అనే ఇద్దరమ్మాయిల్లో ఎవరు కావాలో తేల్చుకోలేని హీరో.. 'మీద పార్ట్ మధు కావాలంటోంది.. కింద పార్ట్ బ్రెట్నీ కావాలని కావాలంటోంది' అనే డైలాగ్ తోనే ఈ సినిమా ఎలాంటి ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ రూపొందిందో అర్థం అవుతోంది. ట్రైలర్ చూస్తుంటే హీరో ఇద్దరమ్మాయిలను ఒకేసారి ప్రేమించడం.. వారితో లవ్ జర్నీ, రొమాన్స్, లేచిపోయి పెళ్లి చేసుకోవడం వంటి అంశాలతో ఈ సినిమా ఉండోబోతోందని తెలుస్తోంది. ఇక హీరో ఇద్దర్నీ లవ్ చేస్తున్నాడన్న విషయం తెలిసిన హీరోయిన్లు.. 'ఇద్దరినీ ఒకేసారి ఎలా ప్రేమిస్తావ్? ఇద్దరూ సమానమే అని ఎలా చెబుతావ్?' అంటూ నిలదీసే సన్నివేశం ఈ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. బోల్డ్ సన్నివేశాలు.. డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో నిండిన 'మై బాయ్‌ ఫ్రెండ్స్‌ గర్ల్‌ ఫ్రెండ్‌' ఓటీటీ ప్రేక్షకులను అలరించేలా ఉంది. ఇప్పటికే సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ త్వరలోనే ప్రముఖ ఓటీటీలో విడుదల కానుందని సమాచారం.