విలన్ గా మారిన మ్యూజిక్ డైరెక్టర్

Fri Aug 12 2022 15:10:25 GMT+0530 (IST)

Music Director Turned Villain

ఈ మధ్య డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు మ్యూజిక్ డైరెక్టర్లు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మారి సరికొత్త అవతారాల్లో సర్ ప్రైజ్ చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో చాలా మంది సీనియర్ నిర్మాతలు దర్శకులు తమ సినిమాల్లో చిన్న గెస్ట్ రోల్స్ లో మెరిసారు కూడా. తాజాగా 90 వ దశకంలో రాజ్ తో కలిసి సంగీత ప్రచంచాన్ని ఏలిన సంగీత దర్శకుడు కోటి కూడా రంగంలోకి దిగారు. సంగీత దర్శకుడిగా సంచలన ఆల్బమ్స్‌ని ఎవర్ గ్రీన్ సాంగ్స్ ని అందించిన ఆయన తొలిసారి నటుడిగా తెరంగేట్రం చేస్తున్నారు.అది కూడా కరుడుగట్టిన విలన్ గా కావడం విశేషం. ప్రముఖ సంగీత దర్శకుడు కోటీ విలన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పగ పగ పగ'. సుంకర బ్రదర్స్ సమర్పణలో అభాలాష సుంకర దీపిక ఆరాధ్య హీరో హీరోయిన్ లుగా నటిస్తున్నారు. వినోదాత్మకంగా సాగే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. రవిశ్రీ దుర్గా ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. సుంకర సత్యనారాయణ నిర్మిస్తున్నారు.  

నీసెంట్ గా విడుదల చేసిన సినిమా పోస్టర్ కు మంచి స్పందన లభించింది. తాజాగా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ చేతుల మీదుగా మోషన్ పోస్టర్ ని విడుదల చేశారు. ఆద్యంతం సరికొత్తగా వుండటంతో మంచి స్పందనని రాబట్టింది.

తాజాగా శుక్రవారం ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ ని దర్శకుడు మెహర్ రమేష్ విడుదల చేశారు. గ్లింప్స్ లో చూపించిన యాక్షన్ ఘట్టాలు కరుడు గట్టిన విలన్ గా కోటీ పాత్రని మలిచిన తీరు ఆకట్టుకుంటోంది. ఇందులో ఆయన పవర్ ఫుల్ విలన్ గా నటిస్తున్నారు.  

గ్లింప్స్ లో కోటీ హావ భావాలు.. డైలాగ్ డెలివరీ బాడీ లాంగ్వేజ్ క్యారెక్టర్ లుక్ కొత్తగా వున్నాయి. 'హలో పెజ్జోని పేటోడికి పనిస్తే వాడు ఆఖరి క్షణంలో వున్నా పని పూర్తి చేస్తాడు' అంటూ కోటీ చెప్పిన డైలాగ్ లు ఆకట్టుకుంటున్నాయి. ఫస్ట్ గ్లింప్స్ తో సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. ఫస్ట్ గ్లింప్స్ తో పాటు కోటి ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు. నెరిసిన జుట్టు గడ్డం.. నోటిలో సిగర్ ని కాలుస్తూ చాలా రఫష్ లుక్ లో కోటీ కనిపిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది.  

ఈ మూవీలోని ఇతర పాత్రల్లో బెనర్జీ జీవికె నాయుడు కరాటే కల్యాణి భరణి శంకర్ రాయల్ హరిశ్చంద్ర సంపత్ జబర్దస్త్ వాసు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం కోటి సినిమాటోగ్రఫీ నవీన్ కుమార్ చల్లా ఎడిటింగ్ పాపారావు ఫైట్స్ రామ్ సుంకర. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.