థమన్ జోరు మామూలుగా లేదు

Sun Jun 26 2022 22:00:01 GMT+0530 (IST)

Music Director Thaman

టాలీవుడ్ లో ప్రస్తుతం మంచి మ్యూజిక్ తో పనికంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంటున్న సంగీత దర్శకుడు థమన్ వరుస సినిమాలతో బిజీగా మారిపోతున్నాడు. ఇటీవల కాలంలో థమన్ ఎలాంటి మ్యూజిక్ అందించిన కూడా సినిమాలకు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. అంతేకాకుండా థమన్ సెలెక్ట్ చేసుకుంటున్న ప్రాజెక్టులు కూడా చాల డిఫరెంట్ గా ఉండటం తో ఆడియన్స్ నుంచి మంచి సపోర్ట్ లభిస్తోంది.రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా  విభిన్నమైన చిన్న తరహా ప్రాజెక్టులకు కూడా ఓకే చెబుతుండడం విశేషం. ఇక ప్రస్తుతం అతన్ని దేవిశ్రీప్రసాద్ కూడా డామినేట్ చేస్తూ ఉన్నాడు అనే చెప్పాలి. కొత్తగా అగ్ర దర్శకుల తోనే తమన్ ఎక్కువగా కంటిన్యూ అవుతున్నాడు. అఖండ భీమ్లా నాయక్ సర్కారు వారి పాట ఇలా వరుసగా పెద్ద సినిమాలో భారీ విజయాలను సొంతం చేసుకున్న థమన్ ప్రస్తుతం కూడా అదే తరహాలో ముందుకు కొనసాగుతున్నాడు.

ఇక ప్రస్తుతం అతని చేతిలో ఉన్న ప్రాజెక్టుల విషయానికి వస్తే అందులో మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోయే సినిమాపై అంచనాలలో అయితే గట్టిగానే ఉన్నాయి. అలాగే బాలయ్య గోపీచంద్ మలినేని సినిమాకు కూడా తమ సంగీతమ అందిస్తున్న విషయం తెలిసిందే. తమిళ హీరో విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న సినిమాపై కూడా హైప్ ఎక్కువగానే ఉంది.  ఈ సినిమాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాకు కూడా ఇప్పటికే పూర్తి తరహాలో ట్యూన్స్ అన్ని కూడా రెడీ చేసి ఉంచాడు.

మరోవైపు నాగచైతన్య విక్రమ్ కుమార్ థాంక్యూ సినిమా కూడా మరో కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే పక్కా కమర్షియల్ కూడా విడుదలకు సిద్ధమైంది. వీటితో పాటు శివ కార్తికేయన్ ప్రిన్స్ సినిమా అలాగే మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు కూడా లైన్లో ఉన్నాయి. ప్రస్తుతం భారీ స్థాయిలో పారితోషికం అందుకుంటున్న థమన్ ఈ ఏడాది మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఎక్కువ ఆదాయాన్ని అందుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.