#బాస్ ప్లాన్.. గజిని సీక్వెల్లో అల్లు అర్జున్?

Mon May 03 2021 14:00:01 GMT+0530 (IST)

Murugadoss Allu Arjun Combo

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప చిత్రీకరణను పూర్తి చేసి ఆ తర్వాత ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నారని కథనాలొస్తున్నాయి. ఓవైపు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్.. కొరటాల శివతోనూ అతడు సినిమాలకు ప్లాన్ చేస్తుండగా మురుగదాస్ తో ఎలాంటి ప్లాన్ అమల్లో పెట్టబోతున్నాడు? అన్నది ఉత్కంఠగా మారింది.జాతీయ ఉత్తమ దర్శకుడిగా సంచలనాలు సృష్టించిన మురుగదాస్ తో సినిమా అంటే జాతీయ స్థాయిలో అంచనాలుంటాయి. పైగా ఇది పాన్ ఇండియా అప్పీల్ తో ఉంటుంది. అందుకే దీనిపై అభిమానుల్లో ఆసక్తి.

ఇంతకీ ఎలాంటి కాన్సెప్ట్ తో తీస్తారు? అన్న ప్రశ్న వేస్తే.. ఇంతకుముందు అల్లు అరవింద్ గజిని 2 టైటిల్ ని ఫిలింఛాంబర్ లో రిజిస్టర్ చేయించారని బన్ని-మురుగదాస్ కాంబినేషన్ లో ఇది తెరకెక్కుతుందని ప్రచారమైంది. ఇక మురుగదాస్ కూడా బన్నీ కోసం స్క్రిప్టును వందశాతం సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. గ్యాప్ వచ్చినా స్క్రిప్టును వందశాతం రెడీ చేసి కలిసేందుకు ఈ వెయిటింగ్. రజనీకాంత్ దర్బార్ తర్వాత మురుగదాస్ కి ఎందుకింత గ్యాప్ అంటే...బన్నీతో గజిని సీక్వెల్ కోసమేనని భావిస్తున్నారు.

గజినీ చిత్రంలో సూర్య నటించగా సంచలనాలు సృష్టించింది. ఇప్పుడు బన్నీతో మరో లెవల్లో ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. బాస్ అల్లు అరవింద్ గజినీ చిత్రాన్ని హిందీలో అమీర్ ఖాన్ హీరోగా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. అందుకే ఈ సినిమా సీక్వెల్ పై ఆయన ఎంతో ఆసక్తిగా ఉన్నారట.