చనిపోవడానికి ముందు సుశాంత్ ఏం గూగుల్ చేశాడో తెలుసా?

Mon Aug 03 2020 17:40:14 GMT+0530 (IST)

Do you know what Sushant Google did before she died?

సుశాంత్ ఆత్మహత్య వ్యవహారం రెండు రాష్ట్రాల పోలీసు శాఖల మద్య వైరంను పెంచుతున్నాయి. ఈ కేసులో బీహార్ పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో మహారాష్ట్ర పోలీసులు కూడా స్పీడ్ పెంచారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆయన గది నుండి స్వాదీనం చేసుకున్న ఫోన్ మరియు ల్యాప్‌టాప్ ను ఫొరెన్సిక్ నిపుణులు వాటిని విశ్లేషించారంటూ ముంబయి నగర పోలీస్ కమీషనర్ పేర్కొన్నారు. చనిపోవడానికి కొన్ని గంటల ముందు కూడా సుశాంత్ ఫోన్ లో తన పేరును సెర్చ్ చేసుకున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.చనిపోవడానికి కొన్ని రోజుల ముందు వరకు పదే పదే తన మాజీ మేనేజర్ అయిన దిశా సాలియన్ పేరును గూగుల్ లో సెర్స్ చేసేవాడని ఆమె ఆత్మహత్య కేసుతో తనకు సంబంధం ఉంది అన్నట్లుగా మీడియాలో వార్తలు రావడంతో పాటు పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేయడం వల్ల డిప్రెషన్ కు గురై ఉంటాడని కమీషనర్ పేర్కొన్నాడు. డిప్రెషన్ నుండి ఎలా బయట పడాలి అనే విషయాన్ని సెర్స్ చేయడంతో పాటు ఈజీగా మృతి చెందే మార్గాలను కూడా గూగుల్ లో సుశాంత్ వెదికాడు. చనిపోవడానికి రెండు వారాల ముందు నుండి సుశాంత్ మానసిక ఆందళన పడుతూ ఉన్నాడని ఆయన కాల్ హిస్టరీ మరియు ఆయనకు సంబంధించిన బ్రౌజింగ్ డేటాను పరిశీలిస్తే ఈ విషయం అర్థం అవుతుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.