Begin typing your search above and press return to search.

‌టాలీవుడ్ కి ఊపు తెచ్చిన AMB ప్ర‌క‌ట‌న‌

By:  Tupaki Desk   |   1 Dec 2020 6:00 AM GMT
‌టాలీవుడ్ కి ఊపు తెచ్చిన AMB ప్ర‌క‌ట‌న‌
X
గ‌త ఎనిమిది నెల‌లుగా సినీరంగం తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. వైర‌స్ మ‌హ‌మ్మారీ ఊహించ‌ని పిడుగులా అన్నిరంగాల‌పైనా ప‌డింది. ఈ ‌ప్ర‌భావంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమ‌ల్లోకి రావ‌డంతో థియేట‌ర్స్ మూత‌ప‌డ్డాయి. అప్ప‌టి నుంచి థియేట‌ర్లు ఎప్పుడు తెరుస్తారా అని సినీ ప్రియులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపుల‌కు ఎట్ట‌కేల‌కు తెర‌ప‌డింది. డిసెంబ‌ర్ 4 నుంచి మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్లు రీఓపెన్ కాబోతున్నాయి. తొలిగా ఏఎంబీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది.

తొలిగా మ‌హేష్ భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తున్న మ‌ల్టీప్లెక్స్ గ్రూప్ థియేట‌ర్స్‌ ఏఎమ్‌.బీ సినిమాస్ ముందుకొచ్చింది. ఈ క్రైసిస్ కాలంలో గ‌త ఎనిమిది నెల‌లుగా మూత‌ప‌డిన ఈ మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్స్ గ్రూప్ డిసెంబ‌ర్ 4 నుంచి రీఓపెన్ అవుతున్న‌ట్టు థియేట‌ర్స్ యాజ‌మాన్యం మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. `ఇట్స్ టైమ్ ఫ‌ర్ యాక్ష‌న్‌.. వీ ఆర్ ఆల్ సెట్ టు ఓపెన్ డిసెంబ‌ర్ 4` అంటూ ఓ ప్ర‌క‌ట‌న‌ని మీడియాకు విడుల చేసింది.

దీంతో గ‌త కొంత కాలంగా థియేట‌ర్ల రీఓపెన్ ‌పై నెల‌కొన్ని సందిగ్ధ‌త‌కు తెర‌ప‌డుతున్న‌ట్టు అయింది. ఈ ప్ర‌క‌ట‌న రాగానే యంగ్ హీరో విశ్వ‌క్ ‌‌సేన్ స‌హా ప‌లువురు స్టార్లు హ‌ర్షాన్ని వ్య‌క్తం చేశారు. మ‌నం మ‌ళ్లీ వ‌స్తున్నాం అంటూ విశ్వ‌క్ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. ఏఎమ్ బీ సినిమాస్ మంగ‌ళ‌వారం నుంచి బుకింగ్స్ స్టార్ట్ చేసిన‌ట్టు తెలిపారు. థియేట‌ర్స్ రీఓపెన్ పై నెల‌కొన్న ప్ర‌తిష్టంభ‌న తాజా ప్ర‌క‌ట‌న‌తో తొల‌గిపోయి సాధార‌ణ స్థితి నెల‌కొంటుంద‌ని ఆశిద్దాం. క‌నీసం ఈ క్రిస్మ‌స్ మొద‌లు సంక్రాంతి నాటికి పూర్తి స్థాయిలో సాధార‌ణ స్థితి వ‌స్తుంద‌నే ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు స‌హా ఆడియెన్ ఆకాంక్షిస్తున్నారు.