Begin typing your search above and press return to search.

ఓటీటీ సినిమాలపై మల్టీప్లెక్స్‌ బ్యాన్

By:  Tupaki Desk   |   14 Oct 2020 3:30 PM GMT
ఓటీటీ సినిమాలపై మల్టీప్లెక్స్‌ బ్యాన్
X
కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా మార్చిలో మూత బడ్డ థియేటర్లు మెల్లగా ఓపెన్‌ అవుతున్నాయి. రేపటి నుండి పూర్తి స్థాయిలో కాకున్నా పాక్షికంగా అయినా థియేటర్లు ఓపెన్‌ కాబోతున్నాయి. దేశ వ్యాప్తంగా ఈ నెల చివరి వరకు పూర్తి స్థాయిల్లో మల్టీప్లెక్స్‌ లు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఇప్పటికే ఓటీటీలో డైరెక్ట్‌ స్ట్రీమింగ్‌ అయిన కొన్ని సినిమాలను థియేటర్లలో స్క్రీనింగ్‌ కు సిద్దం చేస్తున్నారు. అయితే మల్టీప్లెక్స్‌ వాళ్లు మాత్రం ఆ సినిమాలను ప్రదర్శించేందుకు నిరాకరించాయి.

ఈ లాక్‌ డౌన్‌ టైంలో ప్రముఖంగా దిల్‌ బెచారా.. శకుంతలా దేవి.. సడక్‌ 2.. గుంజన్‌ సక్సేనా ఇంకా మరికొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సినిమాలను థియేటర్లలో కూడా విడుదల చేసేందుకు ముందస్తుగానే వారు ఒప్పందం చేసుకున్నారు. కనుక ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ లు ఆ సినిమాల థియేటర్‌ రిలీజ్‌ కు ఓకే చెబుతున్నాయి. కాని మల్టీప్లెక్స్‌ యాజమాన్యాలు మాత్రం ఆ సినిమాలను ప్రదర్శించేది లేదని.. కొత్త సినిమాలు రిలీజ్‌ లు లేకుంటే ఖాళీగా అయినా ఉంచేందుకు సిద్దం కాని ఆ సినిమాలను తాము ఆడించబోము అంటూ గట్టిగా చెబుతున్నారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. మల్టీప్లెక్స్‌ యాజమాన్యాలు ఖచ్చితంగా ఒప్పుకోక పోవచ్చు అనిపిస్తుంది.