Begin typing your search above and press return to search.

బర్త్ డే నాడు ధోనీ రెండు సంచలన నిర్ణయాలు

By:  Tupaki Desk   |   8 July 2020 5:30 AM GMT
బర్త్ డే నాడు ధోనీ రెండు సంచలన నిర్ణయాలు
X
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జన్మదిన వేడుకలు మంగళవారం ప్రేక్షకులు.. అభిమానులు సంబరంగా చేసుకున్నారు. నిన్న త‌న 39వ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ధోనీ ఓ సంచన ఓ నిర్ణ‌యం తీసుకున్నాడు. ఇక‌పై తాను వాణిజ్య ప్రకటనలు చేయ‌న‌ని ప్రకటించాడు. అలాంటి వాటికి తాను దూరంగా ఉంటాన‌ని తెలిపాడు. ఇక నుంచి ఎలాంటి డీల్సూ కుదుర్చుకోన‌ని స్పష్టం చేశాడు. దీంతోపాటు మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇక నుంచి సేంద్రీయ వ్య‌వ‌సాయానికి మాత్రమే బ్రాండ్ అంబాసిడ‌ర్ లా మారాల‌నుకుంటున్నాడు. అందులో భాగంగా తానే ఓ బ్రాండ్ క్రియేట్ చేసి.. దాన్ని మార్కెట్ లోకి విడుదల చేయబోతున్నాడ‌ంట.

ధోనీ ఈ ఆకస్మిక నిర్ణ‌యాలు తీసుకోవ‌డానికి వెనుక ఓ కథనం దాగి ఉంది. లాక్ డౌన్ విధించినప్పటి నుంచి ధోనీ జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో ఉన్న త‌న ఫామ్ హౌస్ కే ప‌రిమితమయ్యాడు. దాదాపు మూడు నెలల పాటు ఫామ్ హౌస్ లో వ్య‌వ‌సాయం చేస్తున్నాడు. దీంతో వెంట‌నే ఓ ట్రాక్ట‌ర్ కొని వ్యవసాయ పనులు మొద‌లు పెట్టాడు. అది కూడా సేంద్రీయ వ్య‌వ‌సాయం చేయాల‌నుకుంటున్నాడట‌‌.

జార్ఖండ్ లో ధోనీకి 50 ఎక‌రాల పొలం ఉంది. అందులో సేంద్రీయ వ్య‌వసాయం చేస్తున్నాడు. ఈ సందర్భంగా వ్యవసాయంపై పూర్తి అవగాహన పెంపొందించుకుంటున్నాడు. ఏ మొక్క‌ను ఎలా నాటాలి? వాటిని ఎలా పెంచాలి? స‌హ‌జ‌మైన ఎరువు ఎలా త‌యారు చేయాలి? ఇలా తదితర వివరాలన్నీ తెలుసుకుంటున్నాడు. అందులో భాగంగా ధోనీ ఇప్పుడు తన వ్యవసాయ క్షేత్రంలో బొప్పాయి, అర‌టి తోటను సాగు చేస్తున్నాడు. ఇప్ప‌టికే త‌న బ్రాండ్ పేరు కూడా ఆల్రెడీ ఫిక్స్ చేశాడు. ఈ విధంగా సేంద్రీయ వ్యవసాయం చేస్తూ తనకు ఓ బ్రాండ్ సృష్టించుకున్నాడు. దాని పేరు నియో గ్లోబ‌ల్. ఈ పేరుతోనే ధోనీ పండించే ఉత్ప‌త్తులు మార్కెట్లోకి రాబోతున్నాయని సమాచారం.