ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఖుషి చేసిన లేటెస్ట్ సెన్షేషన్

Mon Aug 15 2022 17:00:02 GMT+0530 (IST)

Mrunal Thakur made NTR fans happy

టాలీవుడ్ లేటెస్ట్ సెన్షేషన్ మృనాల్ ఠాకూర్ రాబోయే రోజుల్లో టాప్ స్టార్ హీరోయిన్ గా నిలవడం ఖాయంగా సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సీతారామం సినిమాలో సీత పాత్ర కు ఆమె ప్రాణం పోయడం తో పాటు సినిమా ప్రమోషన్ సమయంలో ఆమె మాట్లాడిన మాటలు మరియు ఆమె బాడీ లాంగ్వేజ్ అన్ని కూడా తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి.తాజాగా ఆమె సీతారామం ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషి అయ్యేలా చేశాయి. ఆ ఇంటర్వ్యూలో మృనాల్ ను టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన ప్రభాస్.. మహేష్.. ఎన్టీఆర్ లలో మీకు ఎవరితో నటించాలని ఉందంటూ ప్రశ్నించగా ఏమాత్రం ఆలోచించకుండా... వెంటనే తనకు ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఉంది అంటూ చెప్పేసింది.

ఎన్టీఆర్ తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సైతం సినిమా ను చేయాలని కోరుకుంటూ ఉంటారు. ఆయన యాక్టింగ్ స్కిల్స్ తో పాటు ఆయన డాన్సింగ్ స్టైల్ ను అంతా ఇష్టపడుతారు. అందుకే ఆయన తో నటించాలని మృనాల్ ఠాకూర్ కూడా కోరుకుంటుంది. మరి మృనాల్ కి ఆ అవకాశం వస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి.

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ఆర్ ఆర్ ఆర్ తర్వాత వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల సినిమా ఇప్పటి వరకు ప్రారంభం అవ్వలేదు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది చివర్లో ప్రారంభం అవుతుందేమో అంటూ కొందరు ఇండస్ట్రీ వర్గాల వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కొరటాల శివ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఇప్పటికే బుచ్చి బాబు సినిమా ను మరియు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా ను చేయబోతున్నాడు. మొత్తం మూడు సినిమాలు కూడా ఏడాదిన్నర గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ఎన్టీఆర్ భావించాడట. కాని కొరటాల శివ సినిమా వద్ద ఎన్టీఆర్ ఆగిపోవాల్సి వచ్చిందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.