కృతి శెట్టి.. శ్రీలీలా ఇప్పుడు మృణాల్ ఠాకూర్

Thu Jul 07 2022 08:00:01 GMT+0530 (IST)

Mrunal Thakur entry on tollywood

ఉప్పెన సినిమా విడుదలకు ముందే కృతి శెట్టి కి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వచ్చాయి. ఆ సినిమా కరోనా వల్ల ఆలస్యం అవ్వడంతో కృతి శెట్టి కెరీర్ ఏమవుతుందో అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేశారు. కాని ఉప్పెన ఆలస్యంగా వచ్చిన సూపర్ హిట్ సాధించింది. ఉప్పెన విడుదలకు ముందు నుండే వచ్చిన ఆఫర్లు విడుదల తర్వాత మరింతగా ఎక్కువ అయ్యాయి.ప్రస్తుతం కృతి శెట్టి ఇండస్ట్రీలో ఎన్ని సినిమాల్లో నటిస్తుందో.. ఎన్ని హిట్స్ దక్కాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక పెళ్లిసందD సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన క్యూటీ శ్రీ లీలా.

ఆ సినిమా ప్లాప్ అయినా కూడా శ్రీలీలా బిజీ బిజీగా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. పెళ్లిసందD సినిమా విడుదలకు ముందు నుండే శ్రీ లీలా సందడి మొదలు అయ్యింది. ఇప్పుడు మృణాల్ ఠాకూర్ కూడా ఆ జాబితాలో చేరింది.

బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన మృణాల్ తెలుగు లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యింది. తెలుగు సినిమా విడుదలకు ముందే ఈమె సోషల్ మీడియా లో షేర్ చేసిన ఫోటో ల ద్వారా ఇక్కడ కూడా పాపులారిటీని దక్కించుకుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సీతారామం తో తెలుగు ప్రేక్షకుల ముందుకు మృణాల్ రాబోతుంది.

ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్ లుక్ తో తెలుగు ప్రేక్షకులను ఈ అమ్మడు అలరించింది. ముందు ముందు ఈ అమ్మడికి టాలీవుడ్ లో మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలోనే పలువురు టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఈ అమ్మడి కాంటాక్ట్ కు ప్రయత్నాలు చేస్తున్నారట. సీతారామం విడుదల అయ్యే సమయం కు మృణాల్ చేతిలో మరో రెండు మూడు సినిమాలు ఉండే అవకాశం ఉంది.

హను రాఘవపూడి హీరోయిన్స్ ను చాలా అందంగా విభిన్నమైన పాత్రల్లో చూపించి వారు జనాల్లో నోటెడ్ అయ్యేలా చేస్తాడు. కనుక సీతారామం సినిమా తో మృణాల్ కూడా ఖచ్చితంగా టాలీవుడ్ లో నోటెడ్ అవ్వబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. హీరోయిన్ గా బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే టాలీవుడ్ లో కూడా టాప్ స్టార్ హీరోయిన్ గా ఈ అమ్మడు పేరు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.