రామ్ సీత బ్యాక్ లెస్ షాకింగ్ ఫోజ్

Tue Aug 16 2022 22:00:01 GMT+0530 (IST)

Mrunal Thakur Backless Shocking Pose

మృనాల్ ఠాకూర్... ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. రెండు వారాల క్రితం విడుదల అయిన సీతారామం సినిమా సూపర్ హిట్ దక్కించుకోగా.. ఆ సినిమాలో సీత పాత్ర ను పోషించిన మృనాల్ ఠాకూర్ టాలీవుడ్ లేటెస్ట్ సెన్షేషన్ గా నిలిచింది. ప్రస్తుతం ఆమె వద్దకు నిర్మాతలు మరియు దర్శకులు క్యూ కడుతున్నారనే వార్తలు వస్తున్నాయి.సీత వంటి ఒక పద్దతైన మంచి పాత్రను చేసిన మృనాల్ ముందు ముందు చేయబోతున్న సినిమాలు ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీతారామం సినిమా లో నిండైన అమ్మాయి గా.. చేతులు ఎత్తి దండం పెట్టాలనిపించేంతటి కాస్ట్యూమ్స్ లో కనిపించింది. ముందు ముందు చేయబోతున్న సినిమాల్లో ఈ అమ్మడు కాస్త స్కిన్ షో చేస్తే తెలుగు ప్రేక్షకుల రియాక్షన్ ఏంటో అనేది చూడాలి.

ఒక వైపు సీతగా సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న మృనాల్ ఠాకూర్ మరో వైపు ఇలా బ్యాక్ లెస్ ఫోటోలతో బెంబేలెత్తిస్తోంది. బాబోయ్ మా సీత నేనా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక్క సారిగా ఇలాంటి బ్యాక్ లెస్ బోల్డ్ ఫోటోలు షేర్ చేయడంతో అభిమానులు మరియు సోషల్ మీడియాలో ఈ ఫోటో ల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

దుల్కర్ సల్మాన్ మరియు మృనాల్ లు రామ్ సీత పాత్రల్లో జీవించారు. దాంతో పాటు ఒక అద్భుతమైన ప్రేమ కథను సినిమాలో దర్శకుడు హను రాఘవపూడి చూపించడంతో టాలీవుడ్ క్లాసిక్ లవ్ స్టోరీ చిత్రంగా సీతారామం సినిమా నిలిచిందంటూ రివ్యూలు వస్తున్నాయి. ఇటీవలే సీతారామం సినిమా 50 కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెల్సిందే.