షాకే.. ఈ భామ అందానికి ఏబీసీనే కారణమంట!

Sat Sep 24 2022 19:00:01 GMT+0530 (India Standard Time)

Mrunal Thakur About Her Beauty

హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ స్వప్న సినిమాస్ పతాకంపై వచ్చిన సీతారామం సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్బులో చేరిన అతి తక్కువ తెలుగు సినిమాల జాబితాలో నిలిచింది. కేవలం టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ ఈ సినిమా దుమ్ములేపేసింది.సీతారామం సినిమాలో రాణిగా మృణాల్ ఠాకూర్ అద్భుతమైన నటనను కనబరిచిన సంగతి తెలిసిందే. ఆ సినిమా విజయంలో ఈ ముద్దుగుమ్మదే ప్రధాన పాత్ర అనడంలో అతిశయోక్తి లేదు. ఈ 32 ఏళ్ల మహారాష్ట్ర ముద్దుగుమ్మ సీతారామం అందించిన విజయంతో మరిన్ని సినిమాలను ఒడిసిపడుతోంది. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెల్లడించింది.

సీతారామం సినిమాలో నిజమైన రాణి ఇలానే ఉంటుందనేలా అద్భుతమైన అందంతో మృణాల్ అదరగొట్టింది. ఈ నేపథ్యంలో తన అందానికి ఏబీసీనే ముఖ్య కారణమని ఈ భామ అనేక ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఉదయం లేవగానే గోరు వెచ్చటి నీటిలో నిమ్మ రసం కలిపిన నీటితో తన దినచర్య ప్రారంభమవుతుందని తెలిపింది. విటమిన్ సిని అందించే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటానని మృణాల్ ఠాకూర్ వెల్లడించింది.

షూటింగులో యాక్టివ్‌గా ఉండాల్సి ఉంటుందని.. అందువల్ల రోజులో ఎక్కువసార్లు తాను కాఫీ తాగుతానని మృణాల్ తన డైటింగ్ సీక్రెట్స్‌ను బయటపెట్టింది. కాఫీ తాగడం వల్ల చర్మం తేమను కోల్పోతుందని అందువల్ల విటమిన్ సికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపింది. విటమిన్ సిని అందించే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటానని లేదా పైపూతగా అయినా రాస్తానని వివరించింది.

అలాగే ఏబీసీ.. యాపిల్ బీట్రూట్ క్యారెట్ కలిపిన జ్యూస్ రోజూ తాగుతా అని అదే తన అందానికి కారణమని నమ్ముతానని పేర్కొంది. ఆహారంలోనూ పండ్లు తప్పక ఉండాల్సిందేనని వెల్లడించింది. ముఖం కడిగిన ప్రతిసారీ మాయిశ్చరైజర్ ఎస్పీఎఫ్ 50 ఉన్న సన్‌స్క్రీన్ రాస్తానని తెలిపింది.

ఇక షూటింగ్ ముగిశాక మేకప్ తొలగిస్తానని.. సీరమ్ మాస్క్ వేసుకుని.. మాయిశ్చరైజర్ రాశాకే నిద్రపోతానని తన సీక్రెట్స్‌ను మృణాల్ పంచుకుంది. షూటింగ్ నుంచి ఏమాత్రం ఖాళీ దొరికినా అలోవెరా టొమాటో లేదా ఏదైనా పండు గుజ్జును 20 నిమిషా రాస్తానని తెలిపింది.

ఇక అన్నిటికంటే ముఖ్యంగా సహజసిద్ధంగా చర్మం నిగనిగలాడటానికి వ్యాయామం కూడా అవసరమని మృణాల్ చెబుతోంది. అందుకే తాడాట యోగా పరుగు.. ఇలా వ్యాయామం చేస్తానని వివరించింది. అలాగే వాటర్ బాటిల్ పక్కనే పెట్టుకుని తరచూ మంచి నీళ్లు తాగుతూనే ఉంటానని తన బ్యూటీ సీక్రెట్స్ వివరించింది.

2014లో విట్టి దండు అనే మరాఠీ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ తెలుగు హిట్ సినిమా జెర్సీ హిందీ రీమేక్‌లో హీరోయిన్గా నటించింది. షాహిద్ కపూర్ హీరోగా హిందీలో వచ్చిన జెర్సీ అక్కడ కూడా మంచి హిట్ కొట్టింది. గతంలో పలు మ్యూజిక్ వీడియోల్లోనూ టీవీ షోల్లోనూ మృణాల్ ఠాకూర్ నటించింది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.