అక్కినేనివారి సినిమాకు సెన్సార్ పూర్తి

Mon Jan 21 2019 19:41:52 GMT+0530 (IST)

Mr Majnu Gets U By A Certificate

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన చిత్రం 'Mr.మజ్ను' ఫిబ్రవరి 25 న విడుదల కానున్న సంగతి తెలిసిందే.  సినిమాకు అక్కినేని అభిమానులు ఆల్రెడీ కౌంట్ డౌన్ మొదలుపెట్టారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని నిర్మాతలు తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. శ్రీ వెంకటేశ్వర సిని చిత్ర బ్యానర్ వారు "Mr.మజ్ను సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. కట్స్ ఏవీ లేకుండా సినిమాకు U/A సర్టిఫికేట్ ఇచ్చారు. 25 న థియేటర్లలో కలుద్దాం" అంటూ ట్వీట్ చేశారు.   సినిమాకు మూడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో యూనిట్ సభ్యులు ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు.  ఇదిలా ఉంటే సినిమా ఆడియో.. ట్రైలర్లకు ప్రేక్షకులనుండి మంచి స్పందన దక్కుతోంది.

అఖిల్ సరసన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. నాగబాబు.. సుబ్బరాజు.. రావు రమేష్.. జయప్రకాష్.. పవిత్ర లోకేష్.. ప్రియదర్శి.. విద్యుల్లేఖ ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటించారు.  థమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. 'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు.