సినిమాలు హిట్ అవుతున్నా.. డబ్బులు మాత్రం తిరిగి రావడం లేదట..!

Thu Mar 04 2021 13:02:57 GMT+0530 (IST)

Movies are being hit but the money is not coming back

కోవిడ్ కారణంగా ఒక ఏడాది పాటు సినీ ఇండస్ట్రీ కోలుకోలేని స్థితికి వెళ్లిపోయింది. చిత్ర పరిశ్రమ మీద ఆధారపడి బ్రతుకే ప్రతి ఒక్కరు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే గత రెండు నెలలుగా ఈ పరిస్థితులు మెల్లిగా సాదారణ స్థితికి చేరుకోవడం మొదలైంది. థియేటర్స్ రీ ఓపెన్ అవడంతో సినిమాలు విడుదలకు క్యూ కడుతున్నాయి. సంక్రాంతిని మొదలుకొని చాలా సినిమాలు హిట్ లిస్ట్ లో చేరిపోయాయి. అంతా బాగానే ఉందనుకుంటుండగా తాజాగా సక్సెస్ కొట్టిన నిర్మాతలకు కొత్త సమస్య ఎదురవుతోందని తెలుస్తోంది.ఈ మధ్య విడుదలైన చాలా సినిమాలు హిట్ అయినప్పటికీ నిర్మాతలకు మాత్రం డబ్బులు తిరిగి రావడం లేదని లేదని తెలుస్తోంది. ఒక ఏడాదిగా రకరకాల ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన ఎగ్జిబిటర్స్ ఇప్పుడు హిట్ సినిమాలకి వచ్చిన ఓవర్ ఫోస్ ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారట. కొందరైతే అసలు కూడా వెనక్కి ఇవ్వడం లేదట. బ్యానర్ ఏదైనా సరే సినిమా హిట్ అయితే బ్రేక్ ఈవెన్ వరకు లెక్కలు చెప్పి ఆ తరువాత నిర్మాత గట్టిగా అడిగితేనే లాభాలు వెనక్కి ఇస్తున్నారని ట్రేడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇటీవలే విడుదలై సూపర్ హిట్ కొట్టిన ఓ సినిమా నిర్మాతల జేబుల్లోకి వెళ్లిన ప్రాఫిట్ ఇప్పటి వరుకు కేవలం 2 కోట్లు మాత్రమేనట. తాజాగా సక్సెస్ కొట్టిన నిర్మాతలందరికి ఇదే సమస్య ఎదురవుతోందని సమాచారం.