ఈ వారం ఓటీటీల్లో డిజాస్టర్లదే పై చేయి

Mon Jun 27 2022 19:02:38 GMT+0530 (India Standard Time)

Movies In OTT This Week

ఈ వారం ఓటీటీలు వీక్షకులకు షాక్ ఇవ్వబోతున్నాయి. భారీ బడ్జెట్ తో రూపొంది కనీసం పెట్టిన బడ్జెట్ ని కూడా రాబట్టలేక వెండితెరపై డిజాస్టర్లు గా నిలిచిన సినిమాలు ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. భారీ స్థాయిలో అంచనాలు అందుకున్న ఈ మూవీస్ థియేటర్లలోకి వచ్చేసరికి చతికిలపడిపోయాయి. కనీస వసూళ్లని కూడా రాబట్టలేక మేకర్స్ కి షాకిచ్చాయి. భారీ నిర్మాణ సంస్థలు క్రేజీ స్టార్ లు నటించిన ఈ సినిమాలు ఇప్పడు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటీతో పాటు రెజీనా మిస్టరీ థ్రిల్లర్ హాలీవుడ్ మూవీ ద టెర్మినల్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నాయి.ఇందులో ముందుగా హారర్ మిస్టరీ థ్రిల్లర్ `అన్యాస్ టుటోరియల్` రాబోతోంది. రెజీనా కసాండ్రా నివేదితా సతీష్ ప్రధాన పాత్రల్లో నటించారు. పల్లవి గంగిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ హారర్ మిస్టరీ థ్రిల్లర్ ని బాహుబలి మేకర్స్ ఆర్కా మీడియా బ్యానర్ పై నిర్మించారు.ఇద్దరు అక్కా చెల్లెళ్ల నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్ లో నివేదితా సతీష్ పాత్రని చూపించిన తీరు ఒళ్లు గగుర్పొడిచేలా వుంది. లైవ్ స్ట్రీమింగ్ టుటోరియల్ అనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ థ్రిల్లర్ జూలై 1 నుంచి ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

ఇక ఇదే రోజున బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన పీరియాడిక్ ఫిల్మ్ `సమ్రాట్ పృథ్వీరాజ్` స్ట్రీమింగ్ కాబోతోంది. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ పై అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య థియేటర్లలో హిందీ తెలుగు తో పాటు ఇతర భాషల్లో విడుదలైంది. హిందుత్వ నేపథ్యంలో ఈ మూవీకి మంచి బజ్ క్రియేట్ అయింది. మొదటి రోజు పది కోట్లని కూడా రాబట్టలేక పోయిన ఈ మూవీ బాలీవుడ్ సినీ చరిత్రలోనే అత్యంత భారీ డిజాస్టర్ గా నిలిచింది. నిర్మాత ఆదిత్య చోప్రాకు భారీ నష్టాలని తెచ్చిపెట్టింది. కనీసం వంద కోట్లని కూడా రాబట్టలేకపోవడం గమనార్హం.

ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో జూలై 1న స్ట్రీమింగ్ కాబోతోంది. ఇక ఇదే మూవీ తరహాలో కంగన రనౌత్ నటించిన `ధాకడ్` నిలిచింది. కంగన వన్ మెన్ ఆర్మీగా నటించిన ఈ మూవీని 85 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. టీజర్ నుంచి ట్రోలింగ్ కు గురైన ఈ మూవీ రూ. 3 కోట్లకు మించి వసూళ్లని రాబట్టలేక కంగన కెరీర్ లోనే అత్యంత డిజాస్టర్ గా మిగిలి బాలీవుడ్ మేకర్స్‌కి షాకిచ్చింది. ఈ మూవీ జీ5 లో స్ట్రీమింగ్ కాబోతోంది.

ఇక ఈ మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్న రోజే అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ `ద టెర్మినల్ లిస్ట్` స్ట్రీమింగ్ కాబోతోంది. క్రిస్ ప్రాట్ ప్రధాన పాత్రలో నటించారు. నేవీ సీల్ కమాండర్ జెమ్స్ రిస్ తన మొత్తం ప్లాటూన్ హత్య వెనకున్న రహస్య శక్తులపై ప్రతీకారం తీర్చుకుంటాడు. కోవర్ట్ మిషన్ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఖచ్చితంగా యాక్షన్ ప్రియుల్ని ఆకట్టుకుంటుంది. జూలై 1న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.