Begin typing your search above and press return to search.

జక్కన్న తో మూవీ.. మహేష్ కండీషన్స్ నిజమెంత?

By:  Tupaki Desk   |   24 Jun 2022 3:30 AM GMT
జక్కన్న తో మూవీ.. మహేష్ కండీషన్స్ నిజమెంత?
X
రాజమౌళితో సినిమా చేయడానికి టాలీవుడ్‌.. కోలీవుడ్‌ హీరోలు మాత్రమే కాకుండా బాలీవుడ్‌ హీరోలు సైతం క్యూ కట్టే పరిస్థితి ఉంటుంది. ఆర్ఆర్‌ఆర్ సినిమాలో బాలీవుడ్ స్టార్‌ హీరో అయిన అజయ్ దేవగన్‌ చిన్న పాత్ర పోషించేందుకు ఒప్పుకున్నాడు అంటే జక్కన్న తో వర్క్ కు ఎంతగా ఉబలాటంతో ఉంటారో అర్థం చేసుకోవచ్చు.

అలాంటి సినిమా ఆఫర్‌ వచ్చిన సమయంలో రాజమౌళితో బేరాలు ఆడటం.. కండీషన్స్ పెట్టడం ఎవరైనా చేస్తారా.. అలా ఎవరైనా చేశారు అంటే అది ఖచ్చితంగా అవివేకం అవుతుంది అనడంలో సందేహం లేదు. ఎన్టీఆర్‌.. రామ్‌ చరణ్‌ వంటి వారు రాజమౌళి ఏం చెప్తే అది చేసుకుంటూ ఆర్‌ ఆర్‌ ఆర్‌ ను ముగించారు. వాళ్లకు ఇబ్బంది అయితే రమా రాజమౌళి లేదా వల్లి గార్ల వద్దకు వెళ్లి చెప్పేవాళ్లట కాని జక్కన్న వద్ద మాత్రం వారు ఎదురు మాట్లాడేవారు కాదట.

జక్కన్న కు ఫ్రీ హ్యాండ్ ఇస్తేనే ఆయా సినిమాలు విజయాన్ని సొంతం చేసుకుంటాయి. అందుకే త్వరలో మహేష్ బాబు తో జక్కన్న చేయబోతున్న సినిమాకు కూడా అదే విధానంను పాటించబోతున్నారు. నిర్మాత మరియు హీరో ఇతర టెక్నీషియన్స్ అంతా కూడా జక్కన్న నిర్ణయానుసారం వర్క్‌ చేయాల్సి ఉంటుంది. అందుకు ముందస్తుగానే ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

అలాంటి జక్కన్న తో మహేష్‌ బాబు హీరోయిన్‌ విషయంలో కండీషన్స్ పెట్టాడు అంటూ కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. మహేష్‌ బాబు సినిమా కోసం రాజమౌళి బాలీవుడ్ హీరోయిన్స్ ను సంప్రదిస్తున్నాడని.. ఆ విషయం మహేష్‌ బాబు కు నచ్చగా తెలుగు లో ఇప్పటికే నటించిన నటిస్తున్న హీరోయిన్స్‌ ను ఎంపిక చేయమని చెప్పాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

అసలు విషయం ఏంటి అంటే ఇప్పటి వరకు కనీసం కథ కూడా రెడీ కాలేదు. ఇటీవలే ఒక స్టోరీ లైన్‌ ను ఫైనల్‌ చేశారు అనే టాక్ వచ్చింది. ఆ విషయంలో కూడా స్పష్టత లేదు. ఇలాంటి సమయంలో మహేష్ బాబు కోసం బాలీవుడ్‌ హీరోయిన్.. అది ఆయనకు నచ్చక పోవడం అనేది చాలా పెద్ద విడ్డూరంగా ఉంది.

రాజమౌళి ఒక వేళ హీరోయిన్ విషయమై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నా కూడా మహేష్ బాబు ఓకే చెప్తాడు. అలాంటి విషయాల్లో మహేష్‌ ఇన్వాల్వ్‌ అయ్యే అవకాశమే లేదు. అసలు ఇప్పటి వరకు హీరోయిన్‌ మ్యాటర్‌ వరకు జక్కన్న మహేష్‌ బాబు మూవీ వెళ్లి ఉండదు. జక్కన్న మూవీ అంటే రోజుకో పుకారు కామన్‌.. అందులో భాగంగానే బాలీవుడ్ హీరోయిన్‌ కు మహేష్ బాబు నో చెప్పాడట అనేది కూడా ఒకటి అనడంలో సందేహం లేదు. జక్కన్న నుండి ఏదైనా విషయం అధికారికంగా క్లారిటీ వచ్చే వరకు నమ్మడానికి లేదు.