Begin typing your search above and press return to search.

దుబాయ్ ప్రియుడిని పెళ్లాడేసిన టీవీ మూవీ న‌టి

By:  Tupaki Desk   |   28 Jan 2022 3:30 AM GMT
దుబాయ్ ప్రియుడిని పెళ్లాడేసిన టీవీ మూవీ న‌టి
X
బాలీవుడ్ నటి మౌని రాయ్ త‌న ప్రియుడు సూరజ్ నంబియార్ ను కేరళ సంప్రదాయ ప‌ద్ధ‌తిలో అలాగే బెంగాలీ సాంప్ర‌దాయంలోనూ వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకలో సూరజ్ నంబియార్ ఎంతో మురిసిపోగా వ‌ధువు మెరుపులు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి.

నేటి ఉదయం గోవాలో కేరళ సంప్రదాయంలో ఈ జంట‌ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి ఫోటోలు ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారాయి. ``నేను అతనిని ఎట్టకేలకు కనుగొన్నాను. మీ ప్రేమ ఆశీస్సులు కావాలి… `` అంటూ మౌని ఎమోష‌న‌ల్ కాగా.. సూరజ్ మాట్లాడుతూ..నా ప్రాణ స్నేహితురాలిని నా జీవితంలోని ప్రేమను పెళ్లి చేసుకున్నాను. అత్యంత అదృష్టవంతుడిగా భావిస్తున్నాను .. అంటూ ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు. ఈ జంట‌కు బాలీవుడ్ ప్ర‌ముఖుల నుంచి ఆశీస్సులు అందాయి. అనుష్క శర్మ- స్మృతి ఇరానీ ఇంకా పలువురు సినీ టెలివిజన్ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు.

మౌనిరాయ్ అక్ష‌య్ కుమార్ స‌ర‌స‌న గోల్డ్ చిత్రంతో బాలీవుడ్ లో ప్ర‌వేశించింది. ఆ త‌ర్వాత సౌత్ లో కేజీఎఫ్ లాంటి క్రేజీ చిత్రంలో ఐట‌మ్ నంబ‌ర్ లో మెరిసింది. తెలుగులో ఈ భామ రంగ ప్ర‌వేశం చేయ‌నుంద‌ని ప్ర‌చార‌మైనా కానీ అవ‌కాశాలేవీ రాలేదు.

దుబాయ్ ప్రియుడితో చెట్టాప‌ట్టాల్!

జనవరి 27న మౌని రాయ్ దుబాయ్ కి చెందిన ప్రియుడు సూరజ్ నంబియార్ తో ప్రేమ‌లో ఉంద‌ని ప్ర‌చార‌మైంది. ఆ త‌ర్వాత‌ వివాహం జ‌రుగుతుంద‌ని క‌న్ఫామ్ చేసింది ఈ జంట‌. ప్రీ-వెడ్డింగ్ వేడుకలు జనవరి 26న ప్రారంభమయ్యాయి. మౌని రాయ్ సినిమాల విష‌యానికి వ‌స్తే `బ్ర‌హ్మ‌స్త్ర‌` లో న‌టిస్తోంది.