ఫోటోటాక్ : ఒల్లు విరుస్తూ అందాల ఆరబోత

Tue Jun 28 2022 08:00:01 GMT+0530 (India Standard Time)

Mouni Roy Latest Photo

బుల్లి తెరపై సుదీర్ఘ కాలం పాటు సందడి చేసిన మౌనీ రాయ్ వెండి తెరపై కూడా ఎంట్రీ ఇచ్చి రఫ్పాడించేసింది. వెండి తెరపై అందివచ్చిన ప్రతి ఒక్క ఆఫర్ ను కూడా సద్వినియోగం చేసుకునేందుకు చాలానే కష్టపడింది. ఇక ఈ మద్య కాలంలో ఇన్ స్టా గ్రామ్ లో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేయడం ద్వారా కుర్రకారు కు చెమటలు పట్టిస్తూ బాబోయ్ అనిపిస్తుంది.హీరోయిన్ గా చేసిన సినిమా లు చాలా తక్కువే అయినా కూడా బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కు ఉన్నంత క్రేజ్ ఈ అమ్మడికి వెండి తెర ద్వారా వచ్చింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఈ అమ్మడి స్థాయిని పెంచుతున్నాయి అంటూ మీడియా వర్గాల వారు మరియు సినీ సర్కిల్స్ వారు చర్చించుకుంటున్నారు.

బిగ్ బాస్ తో పాటు పలు డాన్సింగ్ షో ల్లో కనిపించిన మౌని రాయ్ బుల్లి తెరపై ఒక లేడీ సూపర్ స్టార్ అన్నట్లుగా ఇమేజ్ ను దక్కించుకుంది. ఉత్తరాది ప్రేక్షకులు అమితంగా ఆరాధించే బుల్లితెర నటీమణుల జాబితా లో ఈ అమ్మడు చేరింది. హీరోయిన్ గా ఈ అమ్మడు చేస్తున్న సినిమాల కంటే ఈమె బుల్లి తెరపై కనిపించే సీరియల్స్ మరియు షో లకు మంచి ఆదరణ ఉంటుంది.

టీవీ షో లు మరియు సీరియల్స్ ల్లో ఈమె ఉంటే ఆ షో లేదా సీరియల్స్ సూపర్ హిట్ అవ్వాల్సిందే అన్నట్లుగా పేరు పడింది. మౌనీ రాయ్ ఐటెం సాంగ్స్ ల్లో కూడా అలరించింది. సోషల్ మీడియాలో అందాల ఆరబోత విషయంలో ఎప్పుడు కూడా తగ్గని ఈ అమ్మడు ఒల్లు విరుస్తూ తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఒళ్ళు విరుపులతో ఈ అమ్మడి అందాల ఆరబోత ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందంటూ కామెంట్స్ వస్తున్నాయి.