షూటింగ్ ప్రారంభిస్తానంటున్న యువహీరో!

Mon Aug 03 2020 17:00:22 GMT+0530 (IST)

Younghero is set to start shooting from September!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరో అక్కినేని అఖిల్.. కెరీర్ ప్రారంభం నుండి ఒక్క సరైన హిట్ అందుకోలేకపోయాడు. ఇప్పటి వరకు చేసిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ రుచిని చూపించలేకపోయాయి. ప్రస్తుతం నాలుగవ సినిమాగా రాబోతుంది 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. కానీ ప్లాపులలో ఉన్నా అఖిల్ కి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ఒక మంచి సినిమాతో వస్తే అటు నాగ్ అభిమానులు ఇటు నాగచైతన్య అభిమానులు ఆదరించడానికి సిద్దంగానే ఉన్నారు. కానీ చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతుండటంతో అక్కినేని ఫ్యామిలీ మొత్తం అఖిల్ కెరీర్ గురించి ఆలోచనలో పడింది. అఖిల్.. హలో.. మిస్టర్ మజ్ను సినిమాల తర్వాత చాలా గ్యాప్ తీసుకొని బొమ్మరిల్లు భాస్కర్ కథను ఓకే చేసాడు అఖిల్. కానీ బొమ్మరిల్లు భాస్కర్ కూడా వరుస ప్లాపులలో ఉండటంతో అభిమానులలో అక్కినేని అభిమానులలో ఆందోళన మొదలైంది.ఈ సినిమాకు 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అనే టైటిల్ ఫిక్స్ చేసారు. నిజానికి ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సిన సినిమా.. కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయి వాయిదా పడింది. అయితే ఇప్పుడిప్పుడే షూటింగ్స్ మొదలు పెడదామని ఆలోచన చేస్తున్నారట చిత్రబృందం. కానీ ప్రభుత్వం నుండి అనుమతులు లభించినా షూటింగ్ స్టార్ట్ చేయడానికి వణుకుతున్నారు దర్శక నిర్మాతలు. పరిస్థితి బట్టి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. షూటింగ్ సెప్టెంబర్ నుండి చేయాలనీ ప్లాన్. ఇక షూటింగ్ మొదలు పెడితే గనక ముందుగా సాంగ్ షూట్ ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్. పూర్తి ఫన్ తో ఎమోషన్స్ తో ఈ సినిమాని రూపొందించారని చెప్తున్నారు. అఖిల్ ఈ సినిమాలో మధ్య తరగతి యువకుడిగా కనిపించనున్నారు. అయితే అఖిల్-పూజాల కెమిస్ట్రీ ఈ సినిమాలో ఓ రేంజిలో ఉండబోతుందట. జీఏ2 పిక్చర్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు వాసు వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.