Begin typing your search above and press return to search.

అఖిల్‌ ఎలా ఉన్నాడని నన్నెందుకు అడుగుతున్నారు?

By:  Tupaki Desk   |   16 Jan 2021 9:45 AM GMT
అఖిల్‌ ఎలా ఉన్నాడని నన్నెందుకు అడుగుతున్నారు?
X
తెలుగు బిగ్ బాస్ సీజన్‌ 4 లో మోనాల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హీరోయిన్‌ గా తెలుగులో పలు సినిమాల్లో నటించినా రాని క్రేజ్ బిగ్‌ బాస్ వల్ల మోనాల్‌ కు వచ్చింది. మళ్లీ కనిపించదేమో అనుకున్న మోనాల్‌ ప్రస్తుతం టాలీవుడ్‌ లో మరియు బుల్లి తెరపై బిజీ అయ్యింది. అంతా కూడా బిగ్‌ బాస్ వల్లే అనడంలో సందేహం లేదు. అది కూడా అఖిల్‌ తో ఈమె కెమిస్ట్రీ వల్లే ఈ స్థాయి గుర్తింపు వచ్చిందని నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఇక బిగ్‌ బాస్‌ 4 పూర్తి అయినప్పటి నుండి కూడా బిజీ బిజీగా హైదరాబాద్‌ లో గడిపిన మోనాల్‌ ఇటీవలే గుజరాత్‌ కు వెళ్లింది. అక్కడ నుండి ఇటీవలే మోనాల్ హైదరాబాద్ కు వచ్చింది.

మోనాల్‌ ను హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ లో చూసిన జనాలు పలకరించేందుకు పోటీ పడ్డారు. ఆ సమయంలో కొందరు అఖిల్‌ ఎలా ఉన్నాడు అంటూ మోనాల్‌ ను ప్రశ్నించారట. అఖిల్‌ అంటూ గట్టిగా మొత్తుకుంటూ ఆమెను ఆట పట్టించేందుకు ప్రయత్నించారట. దాంతో ఆమె కాస్త ఇబ్బందికి గురి అయినట్లుగా అనిపించింది. మోనాల్‌ ఆ విషయమై స్పందిస్తూ అఖిల్ ఎలా ఉన్నాడు అన్న సంగతి నన్ను ఎందుకు అడుగుతూ ఉన్నారు. అతడు వాళ్ల ఇంట్లో సంతోషంగా ఉండి ఉంటాడు. అఖిల్‌ విషయం నన్ను అడగడం.. అతడి పేరుతో నన్ను పిలవడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది అంటూ మోనాల్‌ చెప్పుకొచ్చింది. అఖిల్‌ తో ఉన్న సన్నిహిత్యం మరియు ఇతర పరిచయం వల్లే మిమ్ములను అలా జనాలు పిలుస్తున్నారు. ఆ మాత్రం మీరు అర్థం చేసుకోలేరా మోనాల్‌ జీ అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.