కేజీఎఫ్ 3 కి ముహూర్తం ఫిక్స్ చేసేశారు

Sat May 14 2022 15:00:01 GMT+0530 (India Standard Time)

Moment has been fixed for KGF3

కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన సంచలన చిత్రం 'కేజీఎఫ్ 2' ఇటీవల విడుదలై దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. పార్ట్ 1 రికార్డు స్థాయిలో ఆకట్టుకోవడంతో చాప్టర్ 2 పై ప్రేక్షకుల్లో దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో 'కేజీఎఫ్ 2'ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించడంతో ఈ మూవీకి ప్రేక్షకులు వరల్డ్ వైడ్ గా బ్రహ్మరథం పడుతూ వసూళ్ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 1175 కోట్ల మేర వసూళ్లని రాబట్టి సరికొత్త రికార్డుని సృష్టిచిందని ట్రేడ్ వర్గాలు మేకర్స్ చెబుతున్నారు.ఇక బాలీవుడ్ లో ఈ చిత్రం 400 కోట్ల మైలు రాయిని దాటి బాలీవుడ్ చిత్రాలనే అత్యధిక వసూళ్ల పరంగా వెనక్కి నెట్టేసింది. దీంతో ఈ మూవీపై దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది. కన్నడ చిత్ర సీమ నుంచి వచ్చిన డబ్బింగ్ సినిమా ఈ రేంజ్ లో తన ప్రతాపాన్ని చూపించడం భారతీయ సినీ చరిత్రలోనే మొట్టమొదటి సారి అంటూ ట్రేడ్ వర్గాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. ఇదిలా వుంటే ఈ సినిమా ఎండింగ్ లో చాప్టర్ 3 కూడా వుందని దర్శకుడు హింట్ ఇచ్చాడు.

పార్ట్ 3 బుక్ ని ఓ టీవీ ఛానల్ అసిస్టెంట్ గుర్తించడం.. సముద్రంలో షిప్ తో సహ రాఖీ మునిగిపోవడంతో సినిమాకు ఎండ్ కార్డ్ వేసిన ప్రశాంత్ నీల్ అతన్ని వెతుక్కుంటూ ప్రధాని రమీకా సేన్ కు యుఎస్ అధికారులు ఇండోనేషియా అధికారులు ప్రత్యేకంగా ఓ ఫైల్ ని అందించడంతో సినిమా ముగిసింది.

అంటే పార్ట్ 3 ని యుఎస్ ఇండోనేషియా నేపథ్యంలో సాగిస్తాడా? అనే అనుమానాలు మొదలయ్యాయి. నేపథ్యం మారితే సినిమా రేంజ్ కూడా మారుతుందని హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా తెరపైకెక్కిందని ఇప్పటికే సర్వత్రా ప్రశంసలు వినిపిస్తున్న ఈ మూవీ పార్ట్ 3 యుఎస్ ఇండోనేషియా నేపథ్యంలో సాగితే బాక్సాఫీస్ ని కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదని చెబుతున్నారు.

ఇలా పార్ట్ 3 పై చర్చ జరుగుతున్న వేళ చిత్ర నిర్మాత విజయ్ కిరగందూర్ షాకింగ్ విషయాల్ని బయటపెట్టి 'కేజీఎఫ్' అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. పార్ట్ 3 పై ఇప్పటికే అంచనాలు స్కై హైకి చేరిన నేపథ్యంలో ఈ మూడవ భాగాన్ని ఈ ఏడాది డిసెంబర్ లో ప్రారంభించబోతున్నామంటూ ప్రకటించడం విశేషం. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత 'కేజీఎఫ్ 3'కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.  

ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న 'సలార్' మూవీని నవంబర్ వరకు పూర్తి చేయబోతున్నాడు. దీంతో 'కేజీఎఫ్ 3'ని డిసెంబర్ లో స్టార్ట్ చేయబోతున్నాం. ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న 'సలార్' ఇప్పటి వరకు 30 శాతం చిత్రీకరణ పూర్తయింది. అక్టోబర్ నవంబర్ వరకు సినిమాని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఆ తరువాత డిసెంబర్ నుంచి 'కేజీఎఫ్ 3' వర్క్ స్టార్ట్ చేస్తాం. 2023 లో షూటింగ్ మొదలు పెడతాం. 2024లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం' అని క్లారిటి ఇచ్చారు. అయితే దీని కారణంగా ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.