Begin typing your search above and press return to search.

మాలీవుడ్ క్రేజ్..టాలీవుడ్ కి మోజు!

By:  Tupaki Desk   |   12 Feb 2022 2:30 PM GMT
మాలీవుడ్ క్రేజ్..టాలీవుడ్ కి మోజు!
X
రెండు మూడేళ్ల‌గా మాలీవుడ్ కంటెంట్ టాలీవుడ్ కి ఎలా డంప్ అవుతుందో చెప్పాల్సిన ప‌నిలేదు. అక్క‌డ బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన కంటెంట్ తెలుగులో చాలా వేగంగా రీమేక్ అవుతుంది. తెలుగు నెటివిటీకి త‌గ్గ‌ట్టు కొద్దిపాటి మార్పులు చేసి స‌క్సెస్ లు కొట్టేస్తున్నారు హీరోలు. ప్ర‌స్తుతం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌...టాలీవుడ్ హంక్ రానా `భీమ్లా నాయ‌క్` లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా మ‌ల‌యాళంలో హిట్ అయిన `అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్` కి రీమేక్ గా తెర‌కెక్కుతోంది. మాతృక‌లో ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఈగో ఫ్యాక్ట‌ర్ ని ఆధారంగా తెర‌కెక్కిన సినిమా మాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది.

ఈ నేప‌థ్యంలో తెలుగులో రీమేక్ అవుతోంది. ఇక మోహ‌న్ లాల్ న‌టించిన `లూసీఫ‌ర్` చిత్రం తెలుగు రీమేక్ లో మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. `గాడ్ ఫాద‌ర్` టైటిట్ లో దీన్ని మోహ‌న్ రాజా తెర‌కెక్కిస్తున్నారు. ఇంకా `క‌ప్పెలా`..డ్రైవింగ్ లైసెన్స్` అనే మ‌రో రెండు మ‌ల‌యాళం సినిమాలు తెలుగు రీమేక్ కి రెడీ అవుతున్నాయి.

తాజాగా ఈ జాబితాలో `హృద‌యం` అనే సినిమా చేరింది. ప్ర‌ణ‌వ్ మోహ‌న్ లాల్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన `హృద‌యం` ఇటీవ‌లి విడుద‌లై మాలీవుడ్ లో పెద్ద విజ‌యం సాధించింది. ఈనెల 18న ఓటీటీ డీస్నీ హాట్ స్టార్ లోనూ రిలీజ్ అవుతుంది. అయినా స‌రే `హృద‌యం` చిత్రాన్ని తెలుగు ద‌ర్శ‌క‌..నిర్మాత‌లు విడిచిపెట్టలేదు.

ఓటీటీలో రిలీజ్ అవుతున్నా ఎలాంటి సందేహాల‌కు తావు ఇవ్వ‌కుండా రీమేక్ చేయ‌డానికి రెడీ అవుతున్నారు.

టాలీవుడ్ లో ని ఓ టాప్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ `హృద‌యం`ని తెలుగు లో రీమేక్ చేయ‌డానికి రెడీ అవుతోంది. ఈ సినిమా విష‌యానికి వ‌స్తే `హృద‌యం` ఆత్మ‌ని ఆధారంగా చేసుకుని తెర‌కెక్కించారు. కాబ‌ట్టి మాతృక‌లో ఉన్న మూడ్ ని.. ఎసెన్స్ ని రీక్రియేట్ చేయ‌డం అంత వీజీ కాదు. ఇత‌ర భాష‌ల్లో నేటివిటీకి త‌గ్గ‌ట్టు మార్పులు చేయ‌డం కూడా క‌ష్ట‌మైన ప‌నే. మొత్తానికి మ‌ల‌యాళం సినిమాల క్రేజ్ టాలీవుడ్ కి మోజుగా మారిపోయింది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.