Begin typing your search above and press return to search.

మహేష్‌ మల్టీప్లెక్స్ లో మోక్షజ్ఞ సందడి

By:  Tupaki Desk   |   5 Oct 2022 6:24 AM GMT
మహేష్‌ మల్టీప్లెక్స్ లో మోక్షజ్ఞ సందడి
X
నందమూరి అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే. ఆ మధ్య కాస్త బొద్దుగా కనిపించిన మోక్షజ్ఞ ఇప్పుడు సన్నబడ్డాడు. అది సినిమా కోసమే అంటూ అభిమానులు మరింత ఉత్సాహంతో సినిమా కోసం వెయిట్‌ చేయడం మొదలు పెట్టారు.

ఇటీవల బర్త్‌ డే సందర్భంగా మోక్షజ్ఞ ను చూసిన అభిమానులు అప్పటి నుండి హీరోగా ఏ క్షణమైనా రంగ ప్రవేశం చేసే అవకాశం ఉందంటూ భావిస్తున్నారు. ఈ సమయంలో మోక్షజ్ఞ హైదరాబాద్‌ లోని ఏఎంబీ లో సందడి చేశాడు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరు లేకుండా ఒంటరిగా ఏఎంబీ లో మోక్షజ్ఞ కనిపించాడు.

అక్కడ కొందరు మోక్షజ్ఞ ను గుర్తు పట్టి ఇలా ఫోటోలు తీసేందుకు ప్రయత్నించారు.

ఆయన కు ఎదురు పడ్డ అభిమానులకు అభివాదం చేసుకుంటూ లోనికి వెళ్లి పోయాడట. మోక్షజ్ఞ ఏఎంబీ లో సినిమాను చూసేందుకు వచ్చిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

మోక్షజ్ఞ కోసం చాలా మంది కథలు సిద్ధం చేశారు. గతంలో పలువురు దర్శకులు చెప్పిన కథలను బాలయ్య విన్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో శ్యామ్‌ సింగ రాయ్‌ చెప్పిన కథకు బాలయ్య ఓకే చెప్పాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి.

మొత్తానికి మోక్షజ్ఞ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా అతి త్వరలోనే ఒక గుడ్‌ న్యూస్ చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.