Begin typing your search above and press return to search.

మెగా రీమేక్ తమిళ్ డైరెక్టర్ చేతిలోకి వెళ్లిందా..?

By:  Tupaki Desk   |   26 Nov 2020 4:15 AM GMT
మెగా రీమేక్ తమిళ్ డైరెక్టర్ చేతిలోకి వెళ్లిందా..?
X
మెగాస్టార్ చిరంజీవి మళయాళ సూపర్ హిట్ 'లూసిఫర్' చిత్రాన్ని తెలుగు రీమేక్ చేయడానికి ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని హోమ్ బ్యానర్ లో రామ్ చరణ్ - ఎన్వీ ప్రసాద్ కలిసి నిర్మించనున్నారు. ఈ మూవీ రీమేక్ రైట్స్ తీసుకున్నప్పటి నుంచి దర్శకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే విషయంపై క్లారిటీ మాత్రం రావడం లేదు. ముందుగా ఈ మెగా రీమేక్ బాధ్యతలు యువ దర్శకుడు, 'సాహో' ఫేమ్ సుజీత్ కి అప్పగించారు. అయితే అనుకోని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి సుజీత్ తప్పుకున్నాడు. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ చేతిలో పెట్టారని.. ఇప్పటికే రచయిత ఆకుల శివతో కలిసి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు వినాయక్ కూడా ఈ ప్రాజెక్టుని డైరెక్ట్ చేయడం లేదని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది.

తమిళ దర్శకుడు మోహన్ రాజా తెలుగు 'లూసిఫర్' కి దర్శకత్వం వహించే అవకాశం దక్కించుకున్నాడని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. రీమేక్ స్పెషలిస్ట్ గా పిలవబడే మోహన్ రాజా.. రామ్ చరణ్ 'ధ్రువ' మాతృక 'తనివరువన్' చిత్రాన్ని తెరకెక్కించాడు. అలానే తెలుగులో హిట్ అయిన 'జయం' 'అమ్మ నాన్నా ఓ తమిళ అమ్మాయి' 'బొమ్మరిల్లు' వంటి చిత్రాలను సక్సెస్ ఫుల్ గా రీమేక్ చేశాడు. ఇప్పుడు మెగా రీమేక్ బాధ్యతలు అతనికే అప్పగించారని అంటున్నారు. ఇప్పటికే మోహన్ రాజా తన టీమ్ తో పాటు చిరంజీవి చెప్పిన రచయితలతో కలిసి ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాడట. అయితే రీమేక్ స్క్రిప్ట్‌ లకు పెద్దగా మార్పులు చేయడని పేరున్న మోహన్.. మలయాళ 'లూసిఫర్' ని అదే విధంగా తీసే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే ఇందులో మెగాస్టార్ సరసన హీరోయిన్ ఉండకపోవచ్చు. కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య'.. మెహర్ రమేష్ తో 'వేదళమ్' రీమేక్ చేసిన తర్వాత చిరు 'లూసిఫర్' రీమేక్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.