Begin typing your search above and press return to search.

ఆహా 'ఆండ్రాయిడ్‌ కట్టప్ప'లో మోహన్‌ బాబు

By:  Tupaki Desk   |   19 Oct 2020 5:45 AM GMT
ఆహా ఆండ్రాయిడ్‌ కట్టప్పలో మోహన్‌ బాబు
X
ఈ మద్య ఆహా లో ప్రతి శుక్రవారం ఒకటి చొప్పున మలయాళ సినిమాలు డబ్‌ అయ్యి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. రెండు వారాల క్రితం ఆహా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఆండ్రాయిడ్‌ కట్టప్ప. తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించిన ఆ సినిమా మోహన్‌ బాబును కూడా మెప్పించినట్లుగా ఉంది. ఇప్పటికే ఆహా ద్వారా డబ్‌ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమాను రీమేక్‌ చేయాలని కోరుకుంటున్నాడు. ఇటీవల స్వయంగా స్వీయ నిర్మాణంలో నిర్మించేందుకు గాను ఆ సినిమా రీమేక్‌ రైట్స్‌ ను కొనుగోలు చేయడం జరిగింది.

ఒక వృద్దుడు తన కొడుకు విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లిన సమయంలో ఒంటరిగా ఉంటాడు. ఆ సమయంలో అతడు ఇబ్బందులు పడుతూ ఉంటాడు. దాంతో తండ్రి ఒంటరితనంను పోగొట్టేందుకు ఆయనకు సేవలు చేసేందుకు కొడుకు ఒక రోబోను తండ్రి వద్ద ఉంచుతాడు. మెషన్‌లు అంటే అస్సలు ఇష్టం లేని ఆ తండ్రి కొన్నాళ్లు రోబోట్‌ ను దూరం పెడతాడు. మెల్ల మెల్లగా ఆ రోబోల్‌ చేస్తున్న పనులతో మనసుకు దగ్గర చేసుకుంటాడు. ఆ రోబోట్‌కు డ్రస్‌ కుట్టించడం, జాతకం చూపించడం వంటివి చేస్తూ ఉంటాడు. అలా రోబోట్‌ ను పూర్తిగా తన కొడుకుగా అనుకుంటాడు. అయితే ఆ రోబోట్‌ పైలెట్‌ ప్రాజెక్ట్‌ గా మాత్రమే అతడి వద్ద ఉంటుంది.

కొన్నాళ్ల తర్వాత దాన్ని తిరిగి తీసుకు వెళ్లాలని భావిస్తే అందుకు నో చెప్పి అడవి లోకి పారిపోతాడు. రోబోట్‌ తో అడవి లోకి పారిపోయిన ఆ వృద్దుడు ఆ తర్వాత ఏం చేశాడు.. చివరకు ఏం జరిగింది అనేది కథ. ఈ కథలో వృద్దుడి పాత్రలో మోహన్‌ బాబు నటిస్తాడట. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ సినిమాకు కమర్షియల్‌ టచ్‌ ఇచ్చి ఒక దర్శకుడు స్క్రిప్ట్‌ వర్క్‌ మొదలు పెట్టాడట. త్వరలోనే అధికారికంగా రీమేక్‌ ను ప్రకటించే అవకాశం ఉంది. రెండేళ్ల తర్వాత మోహన్‌ బాబు ఆకాశమే నీ హద్దురా సినిమాతో రాబోతున్నాడు. మళ్లీ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చర్చలు జరుపుతున్నాడు.