కౌశల్ హాస్పిటల్ వీడియోకు మిశ్రమ స్పందన

Tue Mar 26 2019 18:18:37 GMT+0530 (IST)

Mixed Response For Kaushal Hospital Video

బిగ్ బాస్ విన్నర్ కౌశల్ మందా ఈమధ్య ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తున్నాడు. కౌశల్ ఆర్మీ సభ్యులు కొంతమంది కౌశల్ పై ఆరోపణలు చేయడం.. టీవీ ఛానల్స్ వాటిపై భారీగా డిబేట్లు జరగడం తెలిసిందే.  ముఖ్యంగా కౌశల్ చేసే  పనులన్నీ పబ్లిసిటీ కోసమేననే ఆరోపణలు విన్పించాయి.   కానీ ఆ ఆరోపణలలో నిజం లేదని కౌశల్ వాటిని తిప్పికొట్టాడు. ఇదిలా ఉంటే రీసెంట్ గా కౌశల్ తన సతీమణి నీలిమకు ఒక మేజర్ సర్జరీ జరగనుందని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.  కౌశల్ అంటే గిట్టని వారు ఇదంతా మరో పబ్లిసిటీ స్టంట్ అని కొట్టి పారేశారు.కానీ నీలిమకు సర్జరీ జరిగిన కాంటినెంటల్ హాస్పిటల్ నుండి కౌశల్ ఒక లైవ్ వీడియో ను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ నీలిమకు చేసిన సర్జరీ విజయవంతం అయిందని ప్రస్తుతం తను విశ్రాంతి తీసుకుంటుందని తెలిపాడు.  నీలిమ పేషెంట్ లా బెడ్ మీద పడుకుని ఉంటే పక్కనే కూర్చుని తీసిన వీడియో పోస్ట్ చేశాడు.  నీలిమ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్  మెసేజిలు పెడుతున్నారని..కాల్స్ చేస్తున్నారని చెబుతూ.. వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.  ఈ విడియోకు మిశ్రమ స్పందన దక్కుతోంది.

చాలామంది నీలిమ త్వరగా రికవర్ కావాలని 'గెట్ వెల్ సూన్' అంటూ కామెంట్ చేశారు. కౌశల్ ఫ్యాన్స్ అయితే "అన్నా బీ పాజిటివ్.. త్వరలోనే వదిన నార్మల్ అవుతుంది. మేమందరం తోడుగా ఉన్నాం" అని మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.  కానీ కొందరు మాత్రం హాస్పిటల్ బెడ్ పై పడుకున్న పేషెంట్ ను ఇలా వీడియోలో చూపించడం ఏంటని విమర్శిస్తున్నారు.

For Video Click Here