మృత్యువుతో పోరాడుతున్న 2019 బ్లాక్ బస్టర్ డైరెక్టర్

Mon Jan 27 2020 19:03:45 GMT+0530 (IST)

Mission Mangal director Jagan Shakti hospitalised

అక్షయ్ కుమార్ హీరోగా పలువురు సీనియర్ మరియు జూనియర్ హీరోయిన్స్ తో తెరకెక్కిన సైంటిఫిక్ చిత్రం 'మిషన్ మంగళ్'. గత ఏడాది టాప్ చిత్రాల జాబితాలో మిషన్ మంగళ్ కూడా నిలిచిన విషయం తెల్సిందే. ఆ బ్లాక్ బస్టర్ మూవీకి జగన్ శక్తి దర్శకత్వం వహించాడు. ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా.. చాలా సీనియర్ దర్శకుడి మాదిరిగా మిషన్ మంగళ్ ను తెరకెక్కించిన దర్శకుడు జగన్ శక్తి విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు పెద్ద హీరోల నుండి రెండు మూడు ఆఫర్లు కూడా అందుకున్నాడు.ప్రస్తుతం తమిళ హిట్ మూవీ కత్తిని హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా రీమేక్ చేసే పనిలో ఉన్న జగన్ హఠాత్తుగా అనారోగ్యం పాలయ్యాడు. స్నేహితులతో పార్టీలో ఉండగా కళ్లు తిరిగి పడిపోయాడట. దాంతో వెంటనే స్నేహితులు జగన్ ను హాస్పిటల్ లో జాయిన్ చేయడం జరిగింది. బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయ్యిందని వైధ్యులు నిర్థారించారు. ప్రస్తుతం ప్రముఖ హస్పిటల్ లో ఐసీయూలో ఉండి చికిత్స పొందుతున్నాడట.

జగన్ అనారోగ్య విషయం తెలిసి అక్షయ్ కుమార్ సహా పలువురు సినీ ప్రముఖులు మరియు టెక్నీషియన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జగన్ ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉందంటూ బాలీవుడ్ వర్గాల వారు చెబుతున్నారు. ఆయన తిరిగి మామూలు మనిషి అవ్వాలంటూ సన్నిహితులు మరియు శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.