Begin typing your search above and press return to search.

MI7 ట్రైల‌ర్ : క్లైమాక్స్ లో ఆ ఒక్క జంప్ చాలు టికెట్ గిట్టిన‌ట్టే!

By:  Tupaki Desk   |   24 May 2022 4:55 AM GMT
MI7 ట్రైల‌ర్ : క్లైమాక్స్ లో ఆ ఒక్క జంప్ చాలు టికెట్ గిట్టిన‌ట్టే!
X
హాలీవుడ్ పాపుల‌ర్ యాక్ష‌న్ స్టార్ టామ్ క్రూజ్ క‌థానాయ‌కుడిగా మిష‌న్ ఇంపాజిబుల్ ఫ్రాంఛైజీ అత్యంత విజ‌య‌వంత‌మైన ఫ్రాంఛైజీగా ర‌న్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచ‌వ్యాప్తంగా బిలియ‌న్ల డాల‌ర్ల వ‌సూళ్ల‌ను తెచ్చే సిరీస్ ని అత‌డు తెర‌కెక్కిస్తున్నాడు. భారీ యాక్ష‌న్ విన్యాసాలు.. గ‌గుర్పొడిచే సాహ‌సాల‌తో అద్భుతం అనిపించే వీఎఫ్ ఎక్స్ టెక్నాల‌జీతో నెవ్వ‌ర్ బిఫోర్ అనిపించే లొకేష‌న్ల‌లో MI సినిమాలు తెర‌కెక్కి రిలీజ‌వుతున్నాయి. ప్ర‌స్తుతం ఈ సిరీస్‌లో ఏడో భాగంతో పాటు ఎనిమిదో భాగం చిత్రీక‌ర‌ణ‌లు పూర్త‌వుతున్నాయి.

తాజాగా మిషన్ ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ వన్ ట్రైలర్ విడుద‌లైంది. టామ్ క్రూజ్ అసాధార‌ణ‌ హంట్ విస్మయపరిచే సాహ‌స విన్యాసాలతో గ‌గుర్పాటుకు గురి చేస్తోంది. పార్ట్ వన్ మొదటి ట్రైలర్ ఆద్యంతం ర‌క్తి క‌ట్టించింది. గ‌గుర్పాటుకు గురి చేసే.. షాకింగ్‌ అనిపించే యాక్షన్ సన్నివేశాల‌తో ట్రైల‌ర్ ఆద్యంతం మెరుపులు మెరిపించింది.

ముఖ్యంగా ఈ ట్రైల‌ర్ లో రైలు పట్టాల నుండి డీప్ ఎండ్ లోకి వెళుతున్నట్లు చూపించడం.. మరొక బిట్ చివరలో హీరో టామ్‌ మోటర్ బైక్ ను నడుపుతూ కొండపై నుండి దూకడం గ‌గుర్పాటుకు గురి చేస్తాయి. ఇది ఏతాన్ హంట్ అనే ప్రమాదకరమైన మిషన్ ని తెర‌పై ఆవిష్క‌రిస్తోంది.

ఆసక్తికరంగా ప్రారంభ సన్నివేశం మినహా.. రెండు నిమిషాల ట్రైలర్ లో ఇంకెక్క‌డా డైలాగ్ అన్న‌దే లేదు. ఓన్లీ యాక్ష‌న్‌.. స్టంట్స్ .. సాహ‌సాలు మాత్ర‌మే. వేగంగా ప‌రిగెత్తే కట్ లతో పూర్తిగా దృశ్యమాన ప్రయాణం ఆక‌ట్టుకుంటుంది.

సైమన్ పెగ్ - రెబెక్కా ఫెర్గూసన్ వంటి రిపీటెడ్‌ పాత్రలు కనిపించినప్పుడు హేలీ అట్వెల్- ఇందిరా వర్మ - పోమ్ క్లెమెంటీఫ్ వంటి ప్రతిభావంతులైన ఆర్టిస్టుల‌ను కొత్తగా ఆవి ష్క‌రించారు. డెడ్ రికనింగ్ పార్ట్ వన్ 2023 జూలై 14 న థియేటర్లలో విడుదలవుతుంది. పార్ట్ టూ 28 జూన్ 2024న పెద్ద స్క్రీన్ పైకి రానుంది.

టామ్ క్రూజ్ - దర్శకుడు క్రిస్టోఫర్ మెక్ క్వారీ గత సంవత్సరం సెప్టెంబర్‌లో MI7 నిర్మాణాన్ని పూర్తి చేసారు. ఇప్పుడు ఫ్రాంచైజీ ఎనిమిదవ భాగాన్ని చిత్రీకరిస్తున్నారు.