సమంత ఫేస్ లో ఏదో మిస్సింగ్?

Wed Dec 08 2021 16:01:33 GMT+0530 (IST)

Missing something on Samantha Face

ఒక తీవ్రమైన ఎమోషన్ ని ఎదుర్కొన్నప్పుడు .. ఒక గొప్ప సంతోషకరమైన వార్త విన్నప్పుడు .. రెండు సన్నివేశాలు దేనికదే డిఫరెంట్. పూర్తి విభిన్నమైన ఎమోషన్స్ ఇవి. అందులో ఒకటి ఆరోగ్యానికి హాని కలిగిస్తే.. ఒకటి మేలు చేస్తుంది. సంతోషంగా ఉన్నప్పుడు పాజిటివిటీ ముఖంలో కనిపిస్తుంది. దానివల్ల ఛామ్ పెరుగుతుంది. దుఃఖం లేదా కష్టంలో ఉన్నప్పుడు ఆ బాధ వెలితి ముఖంలో ప్రత్యక్షమవుతుంది. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ లైఫ్! అన్న తీరుగా.. లైఫ్ లో తీవ్ర ఘటనల్ని ఫేస్ లోనే కనిపెట్టేయొచ్చు.చూస్తుంటే సమంత ఫేస్ లో ఛామ్ మిస్సయినట్టే కనిపిస్తోంది.. తాజా ఫోటోగ్రాఫ్ లో అది బయటపడింది. సామ్ కళ్లు ఉబ్బి ముఖంలో వీక్ నెస్ స్పష్ఠంగా కనిపిస్తోందని ఈ ఫోటో పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం అభిమానుల వాట్సాప్ లలో ఇదే డిస్కషన్. చైతో విడిపోయాక సామ్ ఎమోషనల్ కంట్రోల్ కోసం చేయని ప్రయత్నం లేదు. వరస విహారయాత్రలతో కొంతవరకూ ఎడబాటును తట్టుకోగలిగారు.

ఇప్పుడు లేటెస్ట్ లుక్ హాట్ టాపిక్ అయ్యింది. సమంత ఫేస్ లో ఏదో మిస్సింగ్! అన్న చర్చ సాగుతోంది. ఇన్ సైడ్ గ్లో ఉంటే ఔట్ సైడ్ ప్రతిఫలిస్తుంది. ఇన్ సైడ్ గ్లో ఇంకా రాలేదు మరి. త్వరగా వీటన్నిటి నుంచి సమంత బయటపడాలని మళ్లీ నార్మల్ అవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు.

కెరీర్ మ్యాటర్ కి వస్తే శాకుంతలం రిలీజ్ కి రెడీ అవుతోంది. అలాగే సమంత ఇటీవల వరుస చిత్రాలకు అగీకరిస్తున్నారు. తెలుగులో శ్రీదేవి మూవీస్.. తమిళంలో డ్రీమ్ వారియర్ మూవీస్ బ్యానర్లకు సినిమాలు చేస్తున్నారు. పుష్పలో స్పెషల్ నంబర్ తో అలరించనున్నారు. అలాగే ఓబేబి నిర్మాతలతో కలిసి హాలీవుడ్ మూవీకి సన్నాహకాల్లో ఉన్న సంగతి తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ వంటి సంస్థలతో ఓటీటీ సిరీస్ ల డీల్స్ గురించి చర్చ సాగుతోందనే కథనాలొచ్చాయి. బాలీవుడ్ లో తాప్సీ నిర్మాణ సంస్థలోనూ సామ్ ఓ చిత్రం చేయనుందని కథనాలొచ్చాయి.