Begin typing your search above and press return to search.

మహానటి సీన్.. బానే ఉంది కానీ..

By:  Tupaki Desk   |   25 May 2018 7:19 AM GMT
మహానటి సీన్.. బానే ఉంది కానీ..
X
టాలీవుడ్ లో అసలైన సమ్మర్ బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది మహానటి. కేవలం సావిత్రి పై అభిమానంతోనే మొదట ఆకర్షితులైన జనాలు ఆ తరువాత నటించిన నటీనటుల ప్రతిభను మెచ్చి కూడా సినిమాకు వెళుతుండడం విశేషం. బ్లాక్ అండ్ వైట్ గోల్డెన్ డేస్ అనేలా దర్శకుడు చూపించిన విధానంకి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. సావిత్రి నిజ జీవితాన్ని తెరపై చూసినట్లు ఉందని సినీ ప్రముఖులు కూడా ప్రశంసలను అందించిన సంగతి తెలిసిందే.

ఇకపోతే సినిమాలో ఏవైనా డీలిటెడ్ సీన్స్ ఉంటే మళ్లీ యాడ్ చేయాలని చిత్ర యూనిట్ కు అనేక రకాల డిమాండ్లు వచ్చాయి. అయితే దర్శకుడు నాగ్ అశ్విన్ అలా చేయకూడదని వెబ్ మీడియాలలో రిలీజ్ చేసినప్పుడు తప్పకుండా యాడ్ చేస్తామని ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇక అంతలోపు కొన్ని కట్ చేసిన సన్నివేశాలను యూ ట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా తమిళ్ మిస్సమ్మ సినిమాలోని పాటను రిలీజ్ చేశారు.

దుల్కర్ సల్మాన్ - కీర్తి సురేష్ మధ్య చిత్రీకరించిన ఆ సాంగ్ కొంచెం బాగానే ఉన్నా మరికొంచెం తేడా కొట్టినట్లు అనిపించింది. ముఖ్యంగా కీర్తి హావభావాలు టైమింగ్ మిస్ అయినట్లు కామెంట్స్ వచ్చాయి. దుల్కర్ అయితే బాగానే చేశాడు. అలాగే పాత్రలకు సంబందించిన బి హైండ్ ది సీన్స్ వీడియోలను కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తోంది. మరి ఎక్కువగా కాకుండా కేవలం ఒక నిమిషంలోనే ఆ క్లిప్పింగ్స్ ను విడుదల చేస్తున్నారు.