Begin typing your search above and press return to search.

మీర్జాపూర్‌ వారు మన కోసం..!

By:  Tupaki Desk   |   20 Jun 2021 2:30 AM GMT
మీర్జాపూర్‌ వారు మన కోసం..!
X
అమెజాన్ లో స్ట్రీమింగ్‌ అయిన మీర్జాపూర్‌ రెండు సీజన్‌ లు కూడా సూపర్‌ హిట్‌ అయ్యాయి. ఈ వెబ్‌ సిరీస్ తో పాటు పలు సినిమాలను మరియు టీవీ షో లను కూడా ప్రేక్షకులకు అందించిన ఎక్సెల్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ సంస్థ వారు హిందీలో పలు ప్రాజెక్ట్‌ లను రూపొందిస్తూ ఉన్నారు. ఈ సమయంలోనే సౌత్‌ లో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. పలు బాలీవుడ్‌ సంస్థలు సౌత్‌ నిర్మాతలతో కలిసి సినిమా లను నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పుడు ఎక్సెల్‌ ఎంటర్ టైన్‌ మెంట్‌ సంస్థ తో ఫర్హాన్ అక్తర్‌ సౌత్‌ లో ఒక సినిమా ను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఫర్హాన్ అక్తర్ ఇప్పటికే ఒక సౌత్‌ హీరోతో ఒప్పందం చేసుకున్నాడని.. ఆయనతో చేయబోతున్న సినిమా ను పాన్‌ ఇండియా లెవల్‌ లో విడుదల చేసేలా కూడా స్క్రిప్ట్‌ ను రెడీ చేయిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. సౌత్‌ లో ఏ హీరోతో ఆయన సినిమాను నిర్మించబోతున్నాడు అనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. బాలీవుడ్‌ నిర్మాణ సంస్థల్లో ఎక్కువ శాతం సౌత్ లో నిరాశ పర్చాయి. మరి ఎక్సెల్‌ సంస్థ ఎంత వరకు సౌత్‌ లో సక్సెస్ లను దక్కించుకుంటుందో చూడాలి.

హిందీ భాష చిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా తెలుగు మరియు తమిళ చిత్రాలు వసూళ్లు రాబడుతున్నాయి. కనుక బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ సౌత్‌ లో సినిమా లను చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. ముఖ్యంగా సౌత్‌ స్టార్స్ తో సినిమాలను నిర్మిస్తే పాన్ ఇండియా అప్పీల్‌ ఉంటుందనే ఉద్దేశ్యంతో మీర్జా పూర్‌ నిర్మాతలు మన కోసం సినిమాలు నిర్మించేందుకు సిద్దం అయ్యారు.