Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో మైనింగ్ టైకూన్ పెట్టుబ‌డులా?

By:  Tupaki Desk   |   26 Sep 2021 2:30 AM GMT
టాలీవుడ్ లో మైనింగ్ టైకూన్ పెట్టుబ‌డులా?
X
మైనింగ్ టైకూన్ గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి గురించి ప‌రిచ‌యం అవ‌స‌రంలేదు. మైనింగ్ కింగ్ గా ఎదిగిన గాలి ప్ర‌త్య‌క్షంగా..ప‌రోక్షంగా చాలా ర‌కాల బిజినెస్ ల్లో పెట్టుబ‌డులు పెట్టారు. ఆ ర‌కంగా టాలీవుడ్ లోనూ ఆయ‌న పెట్టుబ‌డులున్న‌ట్లు అప్ప‌ట్లో ప్ర‌చారం సాగింది. టాల‌వుడ్ బ‌డా నిర్మాత‌ల‌తో ఆయ‌న‌కు మంచి సాన్నిహిత్య ఉంద‌ని..ఆ కార‌ణంగా ఆయ‌న పెట్టుబ‌డులు సినిమా నిర్మాణ రంగంలోనూ ఉన్నాయ‌ని మీడియా క‌థ‌నాలు వేడెక్కించాయి. నిర్మాత‌ల‌కు ఆయ‌న బ్యాంక‌ర్లా ప‌నిచేసార‌ని గుసుగుస‌లు వినిపించాయి. అయితే గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి అరెస్ట్ త‌ర్వాత సీన్ మొత్తం మారిపోయింది. ఎక్క‌డ లావా దేవీలు అక్క‌డా నిలిచిపోయాయి.

కొన్నాళ్ల పాటు ట్రాన్సాజాక్ష‌న్ అన్ని స్టాప్ అయిపోయాయి. ఇదే రేంజ్ లో సినిమా పైనాన్స్ అంటే క‌డ‌ప నుంచి ఎక్కువ‌గా సాగేవి. అక్క‌డ ఓ వ‌ర్గం నుంచి ప్ర‌ధానంగా పైనాన్స్ టాలీవుడ్ నిర్మాత‌ల‌కు ధారాళంగా ఉండేది. రియ‌ల్ వెంచ‌ర్ల‌తో పాటు సినిమా నిర్మాణంలో క‌డ‌ప నుంచి స్లీపింగ్ పెట్టుబ‌డుదారులుండే వారు. అయితే క‌రోనా రాక‌తో సీన్ మొత్తం మారిపోయింది. నిర్మాత‌లంతా ఇప్పుడు రొటేష‌న్ లేక చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఆర్ధిక సంక్ష‌భాన్ని ముందే ఊహించిన ఆర్ బీఐ బ్యాకుల మెర్జింగ్ పై కొన్నాళ్లు గా సీరియ‌స్ గా ప‌నిచేస్తోంది. క‌రోనా రాక‌తో మార‌టోరియం విధించ‌డం..త్వ‌రిత‌గ‌తిన లోన్లు సాంక్ష‌న్ కాక‌పోవ‌డం వంటివి టాలీవుడ్ బ‌డా నిర్మాత‌ల‌కు ఇబ్బందిగా మారాయి.

ఈ నేప‌థ్యంలో కొంత మంది బ‌డా నిర్మాత‌లు మ‌ళ్లీ బెంగుళూరు వైపు మ‌ళ్లుతున్నారనే టాక్ వినిపిస్తోంది. మైనింగ్ టైకూన్ గాలి వ‌ద్ద భారీ ఎత్తున పైనాన్స్ తీసుకుంటున్న‌ట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. త‌మ‌కున్న ప‌రిచ‌యాల‌తో చాలా మంది నిర్మాత‌లు ఇప్పుడు గాలిపైనే ఆధార‌ప‌డుతున్నార‌ని గుస గుస‌లు వినిపిస్తున్నాయి. అదే నిజ‌మైతే గాలి మ‌ళ్లీ టాలీవుడ్ లో ప‌రోక్షంగా చ‌క్రం తిప్పడం మొద‌లైన‌ట్లే.