Begin typing your search above and press return to search.

హిందీ ఆడియెన్ కి మైండ్ బ్లాక్ చేయ‌డం గ్యారెంటీ

By:  Tupaki Desk   |   1 Dec 2021 5:30 PM GMT
హిందీ ఆడియెన్ కి మైండ్ బ్లాక్ చేయ‌డం గ్యారెంటీ
X
ప్ర‌భాస్ న‌టించిన తాజా చిత్రం రాధే శ్యామ్. పూజా హెగ్డే క‌థానాయిక‌. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌కుడు. తాజాగా ఆషికి ఆ గయా పాట విడుదలై అభిమానుల్లోకి దూసుకెళ్లింది. నాటి రోజుల్లో యూరోపియ‌న్ క‌ల్చ‌ర్ ని ప్ర‌కృతి అందాల్ని ఈ సినిమాలో ఆవిష్క‌రిస్తున్న తీరు ఆస‌క్తిక‌రం. ప్ర‌భాస్ ఇస్మార్ట్ లుక్ తో రొమాంటిక్ గా క‌నిపించాడు. పూజా హెగ్డే అంతే అందంగా క‌నిపించింది. తెర ఆద్యంతం రొమాంటిక్ పెయిర్ లుక్ స్పెష‌ల్ గా ఆక‌ట్టుకుంది. మిథూన్ స్వరపరిచిన అందమైన ట్యూన్ తో పాటకు అదనపు హంగులు స‌మ‌కూరాయి. ప్రభాస్ -పూజా ఇద్దరూ ఒకరితో ఒకరు రొమాంటిక్ గా మాట్లాడుకునే స‌న్నివేశంలో మాట‌లు ఆక‌ట్టుకున్నాయి.

ఈ చిత్రానికి ప్రభాస్ స్వయంగా డబ్బింగ్ చెప్పారు. హిందీ భాషను అతను పలికిన విధానం చాలా సరళంగా ఆక‌ట్టుకుంటోంది. తెలుగు మాట్లాడినంత బాగా హిందీ మాట్లాడారు డార్లింగ్. హిందీ డబ్బింగ్ తో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న చాలా మంది తెలుగు హీరోలు ఆకట్టుకోవడంలో విఫలమైనా ప్రభాస్ మాత్రం అందుకు భిన్నంగా ప‌ర్ఫెక్ష‌న్ తో మైమ‌రిపిస్తున్నాడు. భాషపై అతని డిక్షన్ కమాండ్ చాలా సమర్ధవంతంగా ఉన్నట్లు అనిపించింది. అతని హిందీ వాయిస్ ఈ రెండు లైన్లు హిందీ బెల్ట్ లో గాళ్స్ లోకి దూసుకెళ్ల‌డం ఖాయం.

బాహుబ‌లికి.. హిందీ నటుడు శరద్ కేల్కర్ కొన్ని లైన్ లకు డబ్బింగ్ చెప్పారు. వాయిస్ చాలా ఆకట్టుకుంది. అయితే ఈసారి ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ప్ర‌భాస్ సొంత వాయిస్ ఉప‌యోగించార‌ట‌. రాధే శ్యామ్ తో ప్రయత్నిస్తున్నాడు. అతను లాంగ్వేజ్ ట్యూటర్ ను నియమించుకున్నాడని దాంతో హిందీ ఉచ్చారణ బాగా కుదిరింది. భాషను సరైన రీతిలో ఉచ్చరించే అన్ని ఇతర అంశాలను త‌ర్ఫీదు పొందాడ‌ట‌. ప్ర‌భాస్ వాయిస్ తోనే జ‌నాన్ని థియేట‌ర్ల‌కు లాగేస్తాడంటూ పొగిడేస్తున్నారు. సినిమాలో కంటెంట్ ఎక్కితే ఇక హిందీ బెల్ట్ నుంచి భారీ వ‌సూళ్ల‌ను కొల్ల‌గొట్ట‌డం ఖాయం అని అంచ‌నా వేస్తున్నారు. బాహుబ‌లి1.. బాహుబ‌లి 2 - సాహో త‌ర్వాత రాధేశ్యామ్ ఫేట్ ఎలా ఉందో వేచి చూడాలి.