బ్లాక్ అండ్ బ్లాక్ లో మైండ్ బ్లాక్ చేసిన శ్రుతి

Tue Jan 18 2022 11:45:54 GMT+0530 (IST)

Mind Blocked Shruti in Black and Black

శ్రుతిహాసన్ బ్లాక్ అండ్ బ్లాక్ లో సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది. ఇటీవల వరుస ఫోటోషూట్లతో వేడి పెంచుతున్న శ్రుతి తాజాగా గ్రాజియా మ్యాగజన్ కోసం బ్లాక్ అండ్ బ్లాక్ లో ఇచ్చిన ఫోజులు నెట్టింట వైరల్ గా మారాయి. వెరోమండ బ్లాక్ లెదర్ డ్రెస్ లో కొన్ని ఫోజ్ లు.. రిబ్డ్ బ్లౌజ్..ప్యాంటుతో నిలబడి కెమెరాకి ఫోజులిచ్చింది. కార్సెట్ బ్లౌస్ -ప్రింటెడ్ జీన్స్ తో వెరైటీ దుస్తుల్లో  టెంప్టింగ్ లుక్ తో ఆకట్టుకుంటోంది. ఈ లుక్స్  చూసిన శ్రుతి బోయ్ ప్రెండ్ లలో ఒకరైన ఆర్మన్ కవిగా మారాడు.ఈ లేటెస్ట్ ఫోటోషూట్ ఓ ప్రతి చిత్రాన్ని పోయోటిక్ గా వర్ణించాడు. ``ఆమె సిరల్లో సంగీతం ప్రవహిస్తుంది. ఆమె కళ్లు తెరవాల్సి ఉంది. అందం అన్ని మూలాల నుండి దాడి చేస్తోంది. ఇక నటన అనేది పూర్తిగా భిన్నమైన బాల్ గేమ్. ఆ విషయం ఆమెకు బాగా తెలుసు. నేను ఆ నటన కోసం కష్టపడి పనిచేయాల్సి ఉంది. ఆమె చెప్పింది నేను చేసాను. నాకు నటించడం అనేది ఒక పజిల్. సంగీతం అనేది నా పాట యొక్క పడవతో నావిగేట్ చేసే నది అయితే దాన్ని పరిష్కరించే అధికారం నాకుంది`` అంటూ బ్లాక్ లెదర్ దుస్తుల్ని ఉద్దేశించి   వర్ణించాడు. ఈ ఫోటోలు ఇన్ స్టాలో వైరల్ గా మారాయి. శ్రుతి అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు పోస్ట్ చేసి అభిమానం చాటుకుంటున్నారు.

ఇక శ్రుతి హాసన్ సినిమాల విషయానికి వస్తే నటిగా బిజీగా ఉంది. పాన్ ఇండియా చిత్రం `సలార్` లో  ప్రభాస్ సరసన నటిస్తోంది. అలాగే ఇటీవలే బాలకృష్ణ సరసన నటించడనికి సంతకం చేసింది. మెగాస్టార్ చిరంజీవి-బాబి ప్రాజెక్ట్ లోనూ హీరోయిన్ చాన్స్ ఈ భామదేనని ప్రచారం సాగుతోంది. ఇంకా కోలీవుడ్ ప్రాజెక్ట్ లు కమిట్ అయింది.