Begin typing your search above and press return to search.

RRR ఫ్యాన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యే ట్రీట్

By:  Tupaki Desk   |   12 May 2021 7:30 AM GMT
RRR ఫ్యాన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యే ట్రీట్
X
మెగా-నంద‌మూరి అభిమానుల‌కు మైండ్ బ్లాక్ అయ్యే ట్రీట్ ముందుందా? అంటే అవున‌నే తెలుస్తోంది. `ఆర్.ఆర్.ఆర్` మొద‌లైన నాటి నుంచి డిలే షూట్స్ ఇబ్బందిక‌రంగా మారాయి. ఆరంభం హీరోలు గాయాల పాల‌వ్వ‌డం.. కీల‌క పాత్ర‌ధారుల‌ కాల్షీట్ల స‌మ‌స్య‌లు.. ఇటీవ‌ల‌ కరోనా ప్ర‌భావం వెర‌సి `ఆర్.ఆర్.ఆర్` యూనిట్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందో తెలిసిందే. క‌రోనా తొలి వేవ్ లో చ‌ర‌ణ్ వైర‌స్ బారిన ప‌డటం...సెకెండ్ వేవ్ లో ఎన్టీఆర్ కి వైర‌స్ సోక‌డం అన్ని ప్ర‌తికూల ప‌రిస్థితులే. ఇలాంటి కార‌ణాల‌తో స‌రైన ప్ర‌మోష‌న‌ల్ మెటీరియ‌ల్ రిలీజ్ కాక‌పోవ‌డంతో ప‌లుమార్లు రామ్ చ‌ర‌ణ్-జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు.

ఏదేమైనా మూవీకి సంబంధించిన స‌రైన అప్ డేట్ క‌రువైంది. అస‌లు ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ విష‌యంలో ఏం జ‌రుగుతుందో అర్థంకాని గంద‌ర‌గోళం నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో కొంత క్లారిటీ ఇచ్చేందుకు జ‌క్క‌న్న రెడీ అవుతున్నారు. తొలిగా ఆర్.ఆర్.ఆర్ అభిమానుల‌కు జ‌క్క‌న్న బిగ్ ట్రీట్ ఇస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈనెల 20 జూనియ‌న్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా కొమ‌రం భీమ్ కొత్త పోస్ట‌ర్ ని రిలీజ్ చేస్తార‌ట‌.

గ‌తంలో చ‌ర‌ణ్ బ‌ర్త్ డేకు అల్లూరి సీతారామ‌రాజు మోష‌న్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేసి అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసాడు. ఇప్పుడు తార‌క్ అభిమానుల కోసం ఇలా స్పెష‌ల్ గా ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం షూటింగ్ బ్రేక్ ప‌డిన నేప‌థ్యంలో జ‌క్క‌న్న ఇంట్లో ఉన్నారు. పోస్ట‌ర్ డిజైన్ పైనే ప‌ని చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న ఉంటుందా లేక నేరుగా తార‌క్ బ‌ర్త్ డే రోజు అంటే మే 20న పోస్ట‌ర్ రిలీజ్ చేసి అభిమానుల‌కు ట్రీట్ ఇస్తారా? అన్న‌ది చూడాలి. ఇక నెల రోజుల చిత్రీక‌ర‌ణ‌ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది. ప‌రిస్థితులు అనుకూలించి ఉంటే ఇదే ఏడాది రిలీజ్ చేసేవారు. కానీ పెండింగ్ ప‌నులు పూర్త‌వ్వ‌ని ఈ ప‌రిస్థితుల్లో ఆల‌స్య‌మ‌వుతుంది. ఆర్.ఆర్.ఆర్ ని వ‌చ్చే ఏడాది రిలీజ్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.