మిలియన్ టచ్ చేయడం ఈజీ కాదు బేబీ

Mon Jul 15 2019 20:00:01 GMT+0530 (IST)

మంచి టైం చూసుకుని పెద్దగా పోటీ లేకుండా వచ్చిన సమంతా ఓ బేబీ రెండో వారంలోకి అడుగు పెట్టాక కూడా స్టడీ రన్ కొనసాగిస్తోంది. నిన్న వీకెండ్ కు మూడు కొత్త సినిమాలు ఉన్నప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద తన డామినేషనే స్పష్టంగా కనిపించింది. కీలకమైన కేంద్రాల్లో నిన్న హౌస్ ఫుల్స్ పడ్డాయని ట్రేడ్ రిపోర్ట్. ఈ జోరు ఇంకొంత కాలం కొనసాగేలా ఉంది. అయితే ఇక్కడున్నంత జోరుగా ఓ బేబీ యుఎస్ లో పెర్ఫార్మ్ చేయడం లేదు.మరీ వీక్ కాదు కానీ మిలియన్ మార్క్ చేరుకోవడానికే టైం తీసుకోవడం చూస్తుంటే రికార్డులు నమోదు చేయడం అంత ఈజీగా కనిపించడం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ బాగానే ఆదరిస్తున్నప్పటికీ మిస్ గ్రానీ రీమేక్ కావడం విదేశీ సినిమాలు చూసే అలవాటు అక్కడ ఎక్కువగా ఉండటం వల్ల సబ్జెక్టు పరంగా మరీ అంత ఎగ్జైట్ మెంట్ అక్కడ ఉండకపోవచ్చు

సో ఇప్పుడు మిలియన్ మార్క్ చేరుకోవడం ఓ బేబీ ముందున్న అతి పెద్ద టాస్క్. వచ్చే వీకెండ్ లోపు సాధ్యమవుతుందా లేదా అనేది కూడా చెప్పలేని పరిస్థితి. ఇది సమంతా తన భుజాలపై సోలోగా మోయాల్సిన మూవీ. హీరో సపోర్ట్ లేని కథ కావడంతో కనెక్ట్ కావడంలో ఆలస్యం అవుతోంది. మిలియన్ మార్కు దాటితే సమంతాకు పెద్ద అచీవ్ మెంట్ అవుతుంది.

ఇప్పటికీ ఎక్కువ మిలియన్ సినిమాలున్న హీరోయిన్ గా రికార్డు సమంతా పేరు మీదే ఉంది. ఓ బేబీ కూడా తోడైతే దాన్ని బ్రేక్ చేయడం అంత సులభంగా ఉండదు. హీరోలు ఉన్న సినిమాల కంటే ఇలా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మిలియన్ కొడితే ఆ కిక్కు వేరే. కానీ బేబీ ఆశలు అంత ఈజీగా అయితే నెరవేరే ఛాన్స్ కనిపించడం లేదు. చూద్దాం