మిల్కీ నెవ్వర్ బిఫోర్ హాటెస్ట్ అవతార్

Wed May 18 2022 10:18:16 GMT+0530 (IST)

Milky Never Before Hottest Avatar

నియాన్ కాంతుల వెలుగు జిలుగుల్లో మిల్కీ వైట్ బ్యూటీ  తమన్నా అందాలు జిగేల్ జిగేల్ మంటున్నాయి. మైండ్ బ్లాకు మైండ్ బ్లాకు..! అంటూ యూత్ హుషారెత్తేంతగా టింజ్ తాజా లుక్ లో కనిపిస్తోంది.ఓవైపు కేన్స్ 2022 ఉత్సావాల్లో సందడి చేస్తున్న మిల్కీ వైట్ బ్యూటీ అక్కడ విభిన్నమైన అలంకరణలతో వేడెక్కించే వస్త్రధారణతో అదరగొడుతోంది. రెడ్ కార్పెట్ లుక్ తో కేన్స్ ని కిల్ చేస్తోంది మిల్కీ.

ఇంతలోనే ఇలా మిల్కీవైట్ బ్యూటీ సరికొత్త రూపం ఇప్పుడు అంతర్జాలంలో వేడెక్కించేస్తోంది. తాజా లుక్ లో నియాన్ గ్రీన్ కలర్ దుస్తుల్లో మిల్కీ ఎంతో హాట్ గా కనిపిస్తోంది. ఇదిగో ఇలా వంగ పువ్వు రంగు ఇన్నర్ లో అందాలను అంతే ఘాటుగా ప్రదర్శిస్తోంది.

మిల్కీ నెవ్వర్ బిఫోర్ హాటెస్ట్ అవతార్ ఇది అంటూ అభిమానులు ఈ ఫోటోలను అంతే వైరల్గా షేర్ చేస్తున్నారు.

మిల్కీ వైట్ బ్యూటీ  సిజ్లింగ్ హాట్ ఫిజిక్ అన్ని వేళలా కేంద్రక ఆకర్షణగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గ్లామర్ విస్ఫోటనంతో సమ్మర్ హీట్ ని అంతకంతకు పెంచేస్తోందంటూ అభిమానులు సోషల్ మీడియాల్లో కితాబిచ్చేస్తున్నారు.

తమన్నా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానుల ముందుకు రానుంది. తదుపరి అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఎఫ్ 3లో గ్లామరస్ పాత్రతో ఆకట్టుకోనుంది. అలాగే తన ఆశలన్నీ చిరంజీవి భోలా శంకర్ పైనా పెట్టుకుంది. సత్యదేవ్ సరసన 'గుర్తుందా శీతాలం' అనే చిత్రంలోనూ నాయికగా నటిస్తోంది.