షూట్..బూట్ లో మిల్కీబ్యూటీ..కేన్స్ కే వన్నె తెచ్చేలా!

Mon May 16 2022 13:14:13 GMT+0530 (IST)

Milky Beauty Tamannaah latest photo

మిల్కీబ్యూటీ తమన్నా భాటియా ఆల్ర్టా మోడ్రన్ దుస్తుల్లో తళుక్కున మెరుస్తుంది.  డిజైన్ దుస్తుల్లో అందంగా ముస్తాబై మరింత వన్నె తీసుకురావడం తమన్నా ప్రత్యేకత. అలాంటి తమన్నాకి అంతర్జాతీయ వేదికలపై వాక్ చేసే అవకాశం వస్తే ఇంకే రేంజ్ లో ముస్తాబవుతుందో చెప్పాల్సిన పనిలేదు. కేన్స్ ఫిలిం పెస్టివల్స్ లో భాగంగా తమన్నా రెడ్ కార్పెట్ వాక్ కి ఎంపికైన సంగతి తెలిసిందే.తాజాగా తమన్నా కొత్త ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో అమ్మడు షూట్..బూట్ ధరించి సమ్ థింగ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.  లైట్ బ్రౌన్ కలర్ షూట్ లో తళుక్కున మెరిసింది. ఈ షూట్ లో తమన్నా కోట్ పై ఉన్న  డిజైనర్ పువ్వులు షూట్ కి వన్నె తీసుకొచ్చాయి.

మ్యాచింగ్ వైట్ కలర్ షూస్ ధరించింది. చేతిలో బ్లాక్ కలర్ బ్యాగ్ తో బిజినెస్ ఉమెన్ లా ముస్తాబై ఆకట్టుకుంటుంది.  కేన్స్ ఫెస్టివల్స్ ప్రారంభానికి ముందే తమన్నా ఇలా మీడియా అటెన్షన్ డ్రా చేయడం విశేషం.

ఈనెల 17 నుండి 28వ  వరకు కేన్స్ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఇండియన్ సినీ తారలు ఎంతో మంది హాజరు కాబోతున్నారు. ఫిల్మ్ ఫెస్టివల్ లో మొదటి రోజు భారత్ తరుపున అక్షయ్ కుమార్.. దీపిక పదుకునే.. ఏఆర్ రెహ మాన్.. పూజా హెగ్డే.. నయనతార  తమన్నా వంటి వారు రెడ్ కార్పెట్ పై సందడి చేయబోతున్నారు.

గతంతో పొలిస్తే ఈసారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఇండియాకు మంచి గౌరవం దక్కింది. పలువురు భారీతయ నటులు పెస్టివల్ కి హాజరవుతున్నారు. అంతే కాదు  సౌత్ ఇండియన్ స్టార్స్ కు అంతర్జాతీయ వేదిక ప్రత్యేకమైన గుర్తింపును ఇచ్చింది.

మొత్తానికి దక్షిణాది సినిమాలు ఇతర దేశాల్లో మంచి గుర్తింపును తీసుకొస్తున్నాయి. `బాహుబలి`.. `ఆర్ ఆర్ ఆర్`..`పుష్ప`..`కేజీఎఫ్` లాంటి చిత్రాలు  ఇలాంటి వేదికలకు సోపానాలు వేస్తున్నాయని భావివొచ్చు.