మే 14 నుంచి మిల్కీ బ్యూటీ 'నవంబర్ స్టోరీ'..!

Mon May 03 2021 11:00:01 GMT+0530 (IST)

Milky Beauty 'November Story' from May 14 ..!

దక్షిణాది అగ్ర కథానాయికల్లో ఒకరైన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా వెబ్ వరల్డ్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆహా ఓటీటీలో '11థ్ అవర్' అనే వెబ్ సిరీస్ తో మెప్పించింది తమన్నా. ఈ క్రమంలో ఇప్పుడు ''నవంబర్ స్టోరీ'' అనే సిరీస్ తో వస్తోంది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ డిస్నీ+హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈద్ సందర్భంగా మే 14న తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో 'నవంబర్ స్టోరీ' సిరీస్ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.'నవంబర్ స్టోరీ' వెబ్ సిరీస్ కి తమిళ దర్శకుడు రామ్ సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ తో ఇదొక క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అని అర్థం అయింది. దేశంలో ప్రసిద్ధ క్రైమ్ నవలా రచయిత అయిన తన తండ్రికి.. ఓ గుర్తు తెలియని వ్యక్తి హత్యకు సంబంధం ఉందని అనుమానించగా.. తమన్నా తన తండ్రిని ఈ మిస్టరీ మర్డర్ నుండి బయటపడేసిందా లేదా అనే నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కింది. ఇందులో తమన్నా తండ్రి పాత్రలో జిఎమ్.కుమార్ నటించారు. తమిళంలో రూపొందించిన 'నవంబర్ స్టోరీ' సిరీస్ ని ఇతర భాషల్లోకి అనువాదం చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ మిల్కీ బ్యూటీకి ఎలాంటి గుర్తింపు తెచ్చి పెడుతుందో చూడాలి.