మిల్కీ ఇన్నాళ్లు ఎలా నెట్టుకొచ్చిందంటే!

Mon Jul 13 2020 15:00:44 GMT+0530 (IST)

Milky Beauty's Magical Way Of Making It In South!

మాటకారితనం .. చలాకీతనంతో మంచి అవకాశాల్ని అందిపుచ్చుకోవడం ఒక కళ. ఆ కోవలో చూస్తే మిల్కీ వైట్ బ్యూటీ తమన్నాకు ఆ క్వాలిటీస్ పెద్ద ప్లస్ అని చెప్పాలి. హ్యాపీడేస్ తర్వాత ఈ అమ్మడు గీతా ఆర్ట్స్ బ్యానర్ లో `100 పర్సంట్ లవ్` లాంటి క్రేజీ ఆఫర్ అందుకుంది అంటే తనకు ఉన్న అద్భుతమైన మాటకారితనం వల్లనే. ఆ తర్వాతా దశాబ్ధంన్నర కెరీర్ జర్నీ గురించి తెలిసిందే. కెరీర్ లో బ్లాక్ బస్టర్లు అన్నవే లేకుండా చాలా కాలం బండి నడిపించిన నాయికగానూ తమన్నా పేరు వినిపిస్తుంది.తమన్నా మాటలతో ఎవరినైనా బురిడీ కొట్టించేస్తుంది. తెలుగు భాషను మాట్లాడడం తనకు పెద్ద ప్లస్. మానసికం గానూ తను వెరీ స్ట్రాంగ్. ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో ఏ పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలో బాగా తెలిసిన భామ. ఇండస్ట్రీలో ఎవరికి ఎంత ప్రాధాన్యతనివ్వాలో కూడా తనకు అనుభవంలో తెలుసు. స్టార్ డమ్ రాన్నంత వరకు తాను కూడా అందరిలానే అనేక ఇబ్బందులు పడినా ఒక్కసారి స్టార్ డమ్ వచ్చాక అన్నిటినీ చకచకా చక్క దిద్దుకుంది. అనవసర వ్యాపకాల్ని దూరం పెడుతూ.. అలా అని ఎవరితోనూ వైరం తెచ్చుకోకుండా.. తానొప్పక నొప్పింపక అన్న తీరుగా అవకాశాలు అందిపుచ్చుకుంది.

అందుకే సౌత్ లో ఇన్నాళ్లు పాగా వేయగలిగింది. ఇక ఇక్కడ తమన్నాతో నటించిన ప్రతి హీరో మళ్లీ మళ్లీ తనతో నటించాలని కొరుకుంటారు. ఇందుకు కారణం తమన్నా యాటిట్యూడే. అయితే టాలీవుడ్ లో సౌత్ ఇండస్ట్రీలో సాగినట్టు బాలీవుడ్ లో తమన్నా ఆటలు సాగలేదు..! అందుకే అక్కడ పెద్దగా రాణించలేకపోయింది. ప్రస్తుతం సౌత్ లోనే కెరీర్ బండిని నడిపిస్తోంది. తెలుగులో దటీజ్ మహాలక్ష్మి రిలీజ్ కావాల్సి ఉంది.  తమన్నాతో మళ్లీ కలిసి నటించడానికి తమిళ హీరో శింబు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్లు తెలిసింది.