Begin typing your search above and press return to search.

మిల్కీ బ్యూటీస్ ఆశలన్నీ F3 పైనే

By:  Tupaki Desk   |   23 May 2022 3:19 AM GMT
మిల్కీ బ్యూటీస్ ఆశలన్నీ F3 పైనే
X
ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో పోటీ తీవ్రత ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకరి తర్వాత మరొకరు చాలా వేగంగా మిగతా వారికి పోటీ ఇస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో అయితే ఇప్పటికీ తీవ్రమైన పోటీ ఉంటుంది అనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుత కాలంలో ప్రేక్షకులు రొటీన్ కాంబినేషన్స్ ను అయితే ఏమాత్రం ఇష్టపడడం లేదు.

అందుకే కొంతమంది బ్యూటీలు చాలా తొందరగా ఫెడౌట్ అవుతున్నారు. ఇక అవకాశాలు అందుకోవడం కూడా పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ప్రస్తుతం తమన్నాభాటియా, మెహ్రీన్ పిర్జదా కూడా నిలదొక్కుకోవాలని చాలా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.

మెహ్రీన్ ఫిర్జాదా తమన్నా భాటియా గత కొంత కాలంగా రిజల్ట్స్ తో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో ఏదో ఒక విధంగా కొనసాగుతూనే ఉన్నారు. వీరికి కమర్షియల్ సినిమాలలోనే ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గా చూసుకుంటే బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ అయిన సినిమాలు రాలేదు. ప్రస్తుతం వీరి చేతిలో ఉన్న ఒకే ఒక్క పెద్ద సినిమా F3 మాత్రమే.

వెంకటేష్ వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమాను F 2 సినిమాకు ఫ్రాంచైజ్ గా అనిల్ రావిపూడి డైరెక్టర్ చేశాడు. F 2 సినిమాతో మంచి సక్సెస్ అందుకోవడంతో ఇప్పుడు F3 సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ నెల 27వ తేదీన రాబోతున్న ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుంది అని చిత్ర యూనిట్ సభ్యులు నమ్ముతున్నారు. ఇక హీరోయిన్స్ ఇద్దరికి కూడా ఈ సినిమా సక్సెస్ కావడం చాలా ముఖ్యం.

ఎందుకంటే ఈ సినిమా తర్వాత వీరి చేతిలో పెద్ద సినిమాలు ఏమీ లేవు. తమన్నా మాత్రమే మెగాస్టార్ చిరంజీవి బోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా కూడా పక్కా కమర్షియల్ మూవీ కావడంతో ఎంత వరకు సక్సెస్ అవుతుందో తెలియదు. మూడు హిందీ సినిమాలు ఉన్నాయి.

కానీ తెలుగులో మాత్రం అవకాశాలు అయితే లేవు. మెహ్రీన్ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఈ బ్యూటీ ఓ రెండు మూడు చిన్న సినిమాలు చేస్తోంది. కన్నడలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకుంది. ఈ తరుణంలో F3 సినిమా సక్సెస్ కావాలనే చాలా బలంగా కోరుకుంటోంది. మరి ఈ ఇద్దరి హీరోయిన్లకు ఈ సినిమా ఎలాంటి బూస్ట్ ఇస్తుందో చూడాలి.