ఫోటో స్టోరిః ఈ దీపావళి భామలు బాగున్నారు

Thu Oct 19 2017 14:59:40 GMT+0530 (IST)

Mehrene Kaur and Tapsee Diwali Wishes

ఇవాళ దీపావళి సంధర్భంగా చాలామంది తారలకు మనకు శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఎవరికి వారు తమ సాంప్రదాయబద్దమైన ఫోటోలను డిజైన్ చేయించి వాటితో విషెస్ రిలీజ్ చేశారు. అయితే ఇలాంటి ఫోటోలన్నింటిలో ఓ ఇద్దరు మాత్రం బాగా ఆకట్టుకున్నారులే.అందరూ స్పెషల్ గా ఫోటోషాపింగ్ చేయిస్తే.. రింగులు జుత్తు బ్యూటి తాప్సీ.. అలాగే బొద్దందం మెహ్రీన్ పీర్జాదా మాత్రం.. ట్రెడిషనల్ గా రెడీ అయ్యి.. నిజంగా దీపాలతో ఫోజులు ఇచ్చారు. మెహ్రీన్ ఒక ఫ్యాషన్ షో కు వచ్చి అక్కడ అలా ఫోజులిస్తే.. తాప్సీ ఒక ప్రముఖ పేపర్ కోసం ఫోజిచ్చింది. ఈ ఫోటోలు రెండూ చాలా బాగున్నాయి అంటున్నారు జనాలు. ముఖ్యంగా ఆ తారల కళ్ళలో నుండి ప్రసరితమవుతున్న ఆ వేయి దీపాల వెలుగు అద్భుతంగా ఉందంటూ ట్విట్టర్లో వీరి ఫోటోలకు మార్కులు పడుతున్నాయి.

ప్రస్తుతం మహానుభావుడు రాజా ది గ్రేట్ సినిమాల రిలీజ్ ఎంజాయ్ చేస్తూ.. జవాన్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది మెహ్రీన్. ఇక తెలుగులో ఆనందో బ్రహ్మతో సక్సెస్ కొట్టి హిందీలో జుడ్వా 2 తో సక్సెస్ కొట్టి.. చాలా హ్యాపీగా ఎనర్జటిక్ గా ఉంది తాప్సీ. దట్సిట్!!