Begin typing your search above and press return to search.

హాట్ హాట్ బికినీ అందాలను రివైండ్ చేసుకుంటున్న మెహ్రీన్

By:  Tupaki Desk   |   9 April 2020 3:00 AM GMT
హాట్ హాట్ బికినీ అందాలను రివైండ్ చేసుకుంటున్న మెహ్రీన్
X
నాని హీరోగా నటించిన 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ మెహ్రిన్ ఫిర్జాద. ఆ తరువాత వరుస సినిమాలతో హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది. మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 – ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఈ ఏడాది ప్రారంభంలో నాగశౌర్య 'అశ్వథ్థామ', నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ హీరోగా నటించిన 'ఎంత మంచి వాడ‌వురా' చిత్రాలలో నటించింది. మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే ఈమె నటించిన సినిమాల్లో హిట్స్ కంటే ఫ్లాపులే ఎక్కువగా ఉండడం తో స్టార్ హీరోల పక్కన నటించే ఛాన్స్ దక్కడం లేదు. ఇటు తెలుగులో వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుంటూనే మరోవైపు తమిళంలో కూడా వరుస అవకాశాలు అందుకుంటుంది. తమిళ్ లో ధనుష్ సరసన 'పటాస్' అనే సినిమాలో మెరిసింది.

ఈ మధ్య తెలుగులో కాస్త క్రేజ్ తగ్గడంతో ఈ అమ్మడు గ్లామర్ డోస్ పెంచేందుకు రెడీ అయినట్టు హాట్ హాట్ ఫోటో షూట్స్ తో హింట్స్ ఇస్తూనే ఉంది. ఇంతకముందు వరుస సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఫిజిక్‌పై కాన్‌సన్‌ట్రేషన్‌ చేసేందుకు సరైన టైమ్‌ దొరక్క అంతకంతకూ బొద్దుగా మారిపోయింది ఈ బ్యూటీ. దాంతో కొంచెం గ్యాప్‌ తీసుకుని, ఫిజిక్‌పై దృష్టి పెట్టింది. ఇప్పుడు సన్నగా మెరుపుతీగలా, మరింత అందంగా తయారైంది. దాంతో అమ్మడికి మళ్లీ అవకాశాలు వస్తాయని ఆశిస్తోంది. స్లిమ్‌గా తయారైన తర్వాత మెహరీన్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. హాట్‌ అండ్‌ బ్యూటిఫుల్‌ పిక్స్‌తో కుర్రకారును రెచ్చగొడుతోంది.

ఇప్పటికే గ్లామర్ గర్ల్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న మెహ్రిన్ సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ, వాటిని సోషల్ మీడియాలో పెడుతూ క్రేజ్ తెచ్చుకుంటుంది. ఇప్పటికే పలు హాట్ ఫొటోలతో షాకుల మీద షాకులిచ్చిన ఈ అమ్మడు తాజాగా కాస్త గ్లామర్ డోస్ పెంచేసి కొత్త ఫోటో పెట్టేసింది. ఈ ఫోటో 'ఎఫ్-2' సినిమా టైంలోనిదిగా తెలుస్తుంది. లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ బ్యూటీ ఒకప్పుడు తనకు బాగా క్రేజ్ తీసుకొచ్చిన బికినీ ఫోజ్ సోషల్ మీడియాలో ఇప్పుడు షేర్ చేసింది. దీని ద్వారా నేనున్నానంటూ గుర్తు చేయడానికి ఆరాటపడుతోంది. ఈ ఫొటోలో టూ పీస్ బికినీ ధరించి క్యూట్‌ స్మైల్‌ ఇస్తూ ఎట్రాక్ట్‌ చేస్తోంది బ్యూటీ మెహ్రీన్‌. ఆ ఫోటోలు చూసిన జనాలు మెహ్రిన్ గ్లామర్ గేట్లు ఎత్తేసిందిరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ఈ బికినీ అందాలను చూసైనా దర్శకనిర్మాతలు ఛాన్స్ ఇస్తారేమో చూడాలి.