Begin typing your search above and press return to search.

రాక్ ..కిర్రాక్ పుట్టిస్తోన్న మెహ‌రీన్!

By:  Tupaki Desk   |   18 Aug 2022 2:30 AM GMT
రాక్ ..కిర్రాక్ పుట్టిస్తోన్న మెహ‌రీన్!
X
పంజాబీ బ్యూటీ మోహ‌రీన్ పిర్జాద టెంప్టింగ్ సెగ‌లు గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. బ్యూటీ ఇన్ స్టా వేదిక‌గా డిజైన‌ర్ దుస్తుల్లో నిత్యం హీటెక్కిస్తూనే ఉంటుంది. స్లిమ్ లుక్ లో కి ట్రాన్స‌ప‌ర్మేష‌న్ త‌ర్వాత గ్లామ‌ర్ వ‌ర‌ల్డ్ లో మ‌రింత యాక్టివ్ గా పాల్గొంటుంది. ఫ్యాష‌న్ ఎంపికల్లో న‌వ్య‌పంథాని ప‌రిచ‌యం చేస్తుంది. స్క‌ర్స్ట్ నుంచి ఆల్ర్టా మోడ్ర‌న్ వ‌ర‌కూ ప్ర‌తీ డిజైన్ లోనూ త‌ళుక్కున మెరుస్తుంది.

తాజాగా అమ్మ‌డు సింపుల్ అండ్ స్టైలిష్ లుక్ లో చూప‌రుల్ని ఆక‌ట్టుకుంది. ఇదిగో ఇక్క‌డిలా ప్లోర‌ల్ ఔట్ ఫిట్ లో థై అందాల్ని..నాభి అందాల్ని ఎలివేట్ చేస్తూ క్యామ్ కి చిక్కింది. క‌ళ్ల‌కి స‌న్ గ్లాసెస్ ధ‌రించి ఇనుప రాడ్డుపై మోచితిని వాల్చి వావ్ అనిపించే లుక్ లో ఆక‌ట్టుకుంటుంది.

బ్యాక్ గ్రౌండ్ లో అంద‌మైన స‌ముద్రం..మెహ‌రీన్ వెనుక‌ క‌ళాత్మ‌క‌మైన ఆర్ట్ వ‌ర్క్ ఫోటోలో హైలైట్ అవుతోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. మెహ‌రీన్ స్లిమ్ లుకి కుర్రాళ్లంతా పిదా అవుతున్నారు.

ఇక మెహ‌రీన్ స‌క్సెస్ ఫుల్ జ‌ర్నీ గురించి చె ప్పాల్సిన ప‌నిలేదు. నాని సినిమా కృష్ణ‌గాడి వీర ప్రేమ గాథ‌ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీకి అవ‌కాశాలు బాగానే వ‌రిస్తున్నాయి. ఇటీవ‌లే 'ఎఫ్ -3' హిట్ తో మ‌రోసారి హానీ ఈజ్ ది బెస్ట్ అనిపించింది. అంత‌కు ముందు 'మంచి రోజులొచ్చాయి' తో యావ‌రేజ్ స‌క్సెస్ ని ఖాతాలో వేసుకుంది.

'ఎఫ్-2' త‌ర్వాత అమ్మ‌డికి చెప్పుకోద‌గ్గ స‌క్సెస్ లేని నేప‌థ్యంలో ఈ రెండు విజ‌యాలు బూస్టింగ్ లా నిలిచాయి. ప్ర‌స్తుతం 'స్పార్క్' అనే తెలుగు..త‌మిళ్ సినిమాలో న‌టిస్తుంది. అలాగే క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌లోనూ లాంచ్ అవుతుంది. 'నీ సిగ‌వొరుగు' అనే సినిమాతో శాండిల్ వుడ్ లో ప్రవేశిస్తుంది. ప్ర‌స్తుతానికి అమ్మ‌డి చేతిలో ఉన్న సినిమాలివే. తెలుగులో కొత్త అవ‌కాశాలేవి రాలేదు.

మెహ్రీన్ వ్య‌క్తిగ‌త విష‌యంలోకి వ‌స్తే.. రాజకీయ నేపథ్యం ఉన్న భవ్య బిష్ణోయ్ ని పెళ్లాడాలనుకున్న సంగతి తెలిసిందే. కానీ ఇరు కుటుంబాల నడుమా సఖ్యత కుదరలేదని టాక్ వినిపించింది. వరుడు అతడి కుటుంబంతో చాలా కాలంగా మెహ్రీన్ కి ఆమె కుటుంబానికి సరిపడలేదని... చాలా విషయాల్లో అభిప్రాయ బేధాలొచ్చాయని కథనాలొస్తున్న సంగ‌తి తెలిసిందే.