డెనిమ్స్ లో మెహ్రీన్ మెరుపులు అదుర్స్

Fri Jan 28 2022 10:03:37 GMT+0530 (IST)

Mehreen Latest Clicks

అందాల కథానాయిక మెహ్రీన్ ఇటీవల పూర్తిగా స్లిమ్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ బ్యూటీ మునుపటితో పోలిస్తే సన్నజాజి తీగలా మెరిసిపోతోంది. మునుపెన్నడూ లేని విధంగా తన గ్లామర్ కంటెంట్ ని పెంచేసింది. ఇప్పుడు మరింత స్టైలిష్ గా కనిపిస్తోంది. తాజాగా మెహ్రీన్ డెనిమ్స్ ధరించి స్టైలిష్ గా ఫోజులిచ్చింది. తనదైన పాల నురుగు లెగ్ సౌందర్యాన్ని ఆవిష్కరించింది. తన హాట్ లెగ్స్ ను కుర్చీలో ఉంచి ఇలా రిలాక్స్ డ్ గా కనిపించింది. టోన్డ్ లుక్ తో మెహ్రీన్ మెరుపులు మత్తెక్కించాయి.``ఒక చిన్న కథ మీరు కిటికీలో నుండి చూస్తే మీరు చూస్తారు`` అని మెహ్రీన్ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చింది. డీప్ బ్లూ డెనిమ్స్ కాంబినేషన్ మెహ్రీన్ కి ఎంతో ఆకర్షణ పెంచింది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ యువతరం వాట్సాపుల్లో వైరల్ గా మారింది.

కెరీర్ మ్యాటర్ కి వస్తే... మారుతి మంచిరోజులొచ్చాయితో హిట్టిచ్చాడు. ప్రస్తుతం ఎఫ్ 3లో నటిస్తోంది. ఈ సినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుని టాలీవుడ్ లో మరింత బిజీ నటిగా వెలిగిపోవాలని కలలుగంటోంది. అటు తమిళంలోనూ ప్రయత్నిస్తోందని సమాచారం.