మెహ్రీన్ కౌర్ కు ఏమైంది..?

Wed Nov 30 2022 23:00:01 GMT+0530 (India Standard Time)

Mehreen Kaur Mysterious Face treatment

కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మెహ్రీన్ కౌర్ అప్పటిదాకా మోడల్ గా పెద్దగా ఎవరికి తెలియకపోయినా తెలుగులో మొదటి సినిమాతోనే మంచి ఐడెంటిటీ తెచ్చుకుంది. ఇక అక్కడి నుంచి వరుస అవకాశాలు అందుకుంటూ వస్తున్న మెహ్రీన్ స్టార్ ఇమేజ్ తెచ్చుకోలేదు కానీ ఒక మోస్తారుగా ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. రీసెంట్ గా F3 సినిమాలో నటించి మెప్పించిన అమ్మడు తన లేటెస్ట్ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ తో అందరికి షాక్ ఇచ్చింది.మొహం నిండా సూదులతో మెహ్రీన్ భయంకరంగా కనిపించింది. అసలు మెహ్రీన్ కు ఏమైంది.. ఎందుకు ఇలా సూదులతో గుచ్చుకుంది అంటే.. అదోరకమైన ఫేస్ ట్రీట్మెంట్ అని తెలుస్తుంది. ఆక్యుపంచర్ లో ఆక్యు స్కిన్ లఫ్ట్ అని ఒక తెరపీ చేయించుకుంటుంది.

దాని వల్ల ఫేస్ మరింత కాంతివంతంగా  తయారవుతుంది. అసలైతే 40 ప్లస్ వారు చేసుకునే ఈ ఆక్యు స్కిన్ లఫ్ట్ ని 27 ఏళ్ల వయసులోనే మెహ్రీన్ ఎందుకు చేయించుకుంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు.      

తన ఫోటోలు చూసి కచ్చితంగా రకరకాల కామెంట్స్ చేస్తారని ముందే గెస్ చేసిన మెహ్రీన్ ఈ పోస్ట్ కి కామెంట్స్ డిసేబుల్ లో పెట్టేసింది. స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరే మెహ్రీన్ ఈ ఆకు స్కిన్ లఫ్ట్ ట్రీట్మెంట్ చేయించుకుంది. అయితే ఎవరి సలహా అయినా తీసుకుందో లేక తనే సొంతంగా వెళ్లి డాక్టర్స్ ని కలిసిందో కానీ మెహ్రీన్ చేసిన ఈ పనికి ఆడియన్స్ మాత్రం షాక్ అవుతున్నారు.

మొహం నిండా సూదులతో తన ఫోటోతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెహ్రీన్ తన ట్రీట్మెంట్ కి దారి తీసిన కారణాలు కూడా వెళ్లడిస్తే బాగుండేది. మొత్తానికి మెహ్రీన్ ఆక్యు ట్రీట్మెంట్ ఆడియన్స్ ని థ్రిల్ అయ్యేలా చేసింది. ఆఫ్టర్ ట్రీట్ మెంట్ ఆమె ఫేస్ వెలిగిపోతుంది.

అయితే న్యాచురల్ అందాన్ని పెంచుకునే క్రమంలో మెహ్రీన్ ఇలా ట్రీట్మెంట్ చేయించుకుందని అంటున్నారు. నెటిజన్లు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో అని కామెంట్స్ ఆప్షన్ డిసేబుల్ చేసింది. మరి అంత డౌట్ ఉన్న మెహ్రీన్ అసలు ఈ ఫోటోలు షేర్ చేయకుండా ఉంటే బాగుండేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.